Fact Check: కేబిసిలో శివరాజ్ సింగ్ చౌహాన్ గురించి ఏ ప్రశ్న అడగబడలేదు, వైరల్ వీడియో నకిలీది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). కౌన్ బనేగా కరోడ్‎పతి (కేబిసి) నుండి ఒక క్లిప్ గా పేర్కొంటూ సొషల్ మీడియా పై ఒక మార్చబడిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను లక్ష్యంగా చేసుకొని ఒక ప్రశ్న అడిగారు. ఈ వీడియో క్లిప్ లో, కేబిసి హోస్ట్ అమితాబ్ బచ్చన్ గారు కంటెస్టెంట్ ను రూ. 20,000 ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న, “ఈ ముఖ్యమంత్రులలో ఎవరు తన అసత్యపు ప్రకటనల కారణంగా ప్రకటనల యంత్రము అని పిలువబడ్డారు?” కంటెస్టెంట్ సమాధానము ఐచ్ఛికము బి, శివరాజ్ సింగ్ చౌహాన్.

విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో, ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడినది అని కనుగొనింది. కేబిసి లో అడగబడిన అసలు ప్రశ్నను వైరల్ వీడియోలో ఉన్న ప్రశ్నగా ఎడిట్ చేశారు. అసలు ప్రశ్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి అడిగినది కాదు. ఇదే కాకుండా, అమితాబ్ బచ్చన్ స్వరాన్ని అనుకరించబడిన స్వరము కూడా విడిగా చేర్చబడింది.

ఏది వైరల్ అవుతోంది

ఫేస్‎బుక్ పేజ్ “ఐటి సెల్ అండ్ సోషల్ మీడియా మాండ్సోర్ అసెంబ్లి అఫీషియల్ పేజ్” “ప్రకటనల యంత్రము శివరాజ్ సింగ్ చౌహాన్’ అనే శీర్షికతో ఒక వీడియోను పోస్ట్ చేసింది. 

వివిధ సోషల్ మీడియా వేదికలపై చాలామంది ఇతర యూజర్లు ఇటువంటి క్లెయిమ్స్ తో ఈ వీడియోను షేర్ చేశారు. పోస్ట్ యొక్క విషయము ఇక్కడ ఉన్న విధంగానే వ్రాయబడింది. పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు

ఒక యూట్యూబ్ సెర్చ్ తో విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తును ప్రారంభించింది. కీవర్డ్స్ తో సెర్చ్ చేసినప్పుడ్, కేబిసి ఇండియా వారి యూట్యూబ్ ఛానల్ నుండి ఒక కంటెస్టెంట్ యొక్క వైరల్ వీడియో మాకు కనిపించింది. ఇది ఎనిమిది నెలల క్రితం అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో, కంటెస్టెంట్ పేరు భూపేంద్ర చౌదరి అని పేర్కొనబడింది. ఇతను మధ్యప్రదేశ్ లోని ఖురై నివాసి.

వైరల్ వీడియో ఉన్న ఫుటేజ్ ను ఈ వీడియోలో 18:50 క్షణాల నుండి చూడవచ్చు. కాని ఈ వీడియోలో, రూ. 20,000 కొరకు అడిగిన ప్రశ్న రాజకీయాలకు సంబందించినది కాదు, అది ఒక సినిమాకు సంబంధించినది.

అమితాబ్ బచ్ఛన్ భూపేంద్రను ఇలా అడిగారు, “ఈ క్రింది చిత్రాలలో ఏది ఒక క్రీడాకారుడికి సంబంధించినది కాదు?” దీనికి, ఆయన ఇచ్చిన ఐచ్ఛికాలు, A – సైనా, B – పీకు, C – భాగ్ మిఖా భాగ్ D –  వెల్ డన్ మిట్టు.

సెర్చ్ సమయములో, దైనిక్ జాగరణ్ యొక్క అక్టోబరు 9 నాటి ఎడిషన్ పై వీడియోకు సంబంధించిన వార్తలు లభించాయి. దాని ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ X పై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురించి ఒక అసత్యపు వీడియో పోస్ట్ చేసినందుకు కాంగ్రెస్ నేత కేకే మిశ్రా పై ఒక ఎఫ్‎ఐఆర్ నమోదు చేయబడింది.

దర్యాప్తుస్ అమయములో, మధ్యప్రదేశ్ ‘జన్ సంపర్క్ ఫాక్ట్ చెక్ అనే పేరు ఉన్న ఫేస్‎బుక్ పేజ్ పై భూపేంద్ర చౌదరీకి సంబంధించిన ఒక వీడియో లభించింది. ఈ వీడియోలో, వైరల్ వీడియోను ఖండించడం వినవచ్చు.

దర్యాప్తును కొనసాగిస్తూ, విశ్వాస్ న్యూస్ నయీదునియా ఎడిటర్, మధ్యప్రదేశ్-ఛత్తీస్‎ఘడ్ అయిన సద్గురు శరణ్ అవస్థి గారిని సంప్రదిచింది. ఆయన ఈ పోస్ట్ నకిలీది అని తెలిపారు.

బీజేపి రాష్ట్ర విలేఖరి పంకజ్ చతుర్వేది ఇలా అన్నారు, కొంతమంది ముఖ్యమంత్రి పేరుప్రతిష్ఠలకు కళంకాన్ని ఆపాదించుటకు వైరల్ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా నకిలీది.

దర్యాప్తు చివరికి, నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన పేజ్ కనుగొనబడింది. ఈ పేజ్ ఒక రాజకీయ పార్టీకి సంబంధించినది అని తెలిసింది.

ముగింపుకేబిసి యొక్క ఎడిట్ చేయబడిన వీడియోలు సోషల్ మీడియా పై షేర్ చేయబడ్డాయి అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు తెలిపింది. దీనిలో, రూ. 20,000 ప్రైజ్ మనీ కొరకు అడగబడిన ప్రశ్న స్థానములో శివరాజ్ సింగ్ చౌహాన్ కు సంబంధించిన ఎడిట్ చేయబడిన ప్రశ్న చేర్చబడింది. అసలైన వీడియో యొక్క భాగాలను కలిపి వైరల్ వీడియో తయారు చేయబడింది. దీనిలో, ప్రశ్న సమయములో స్వరము విడిగా చేర్చబడింది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు