విశ్వాస్ న్యూస్ వారు చేసిన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని తేలింది. ఇలాన్ మస్క్ ఇటువంటి ట్వీట్ ఏదీ చేయలేదు.
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఇలాన్ మస్క్ ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్క్రీన్ షాట్ ప్రకారం, ట్విట్టర్ కొనుగోలు చేసిన తరువాత, ఇలాన్ మస్క్ ఇలా ట్వీట్ చేశారు, ‘ఇప్పుడు నేను ఫేస్ బుక్ ను కూడా కొనుగోలు చేస్తాను మరియు ఆ తరువాత దానిని తొలగిస్తాను.’ విశ్వాస్ న్యూస్ వారు చేసిన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని తేలింది. ఇలాన్ మస్క్ ఇటువంటి ట్వీట్ ఏదీ చేయలేదు.
ఫేస్ బుక్ యూజర్ ఏంజిలో బేన్స్ జూ ఈ వైరల్ పోస్ట్ ను ఏప్రిల్ 27న షేర్ చేశారు. ఈ పోస్ట్ వెంబడి ఉన్న ఉపశీర్షిక ఈ విధంగా ఉంది, “ఫ్రెండ్స్టర్ కు ఫేస్ బుక్ చేసిన మాదిరిగానే ఇలాన్ మస్క్ ఫేస్ బుక్ ను కొనబోతున్నారు మరియు ఆయన దానిని తొలగించబోతున్నారు. దేవుడా! కర్మ అనేది నిజమే.”
వైరల్ స్క్రీన్ షాట్ గురించిన వాస్తవాలను తెలుసుకొనుటకు మేము ఇలాన్ మస్క్ యొక్క ట్విట్టర్ ఖాతా ను స్కాన్ చేశాము, కాని వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన ఎలాంటి ట్వీట్ మాకు కనిపించలేదు. దీని తరువాత, మేము వైరల్ స్క్రీన్ షాట్ ను జాగ్రత్తగా పరిశీలించాము. ఈ ట్వీట్ మార్చ్ 25, 2022 నాడు పోస్ట్ చేయబడింది అని మేము కనుగొన్నాము. ఆ తరువాత మేము https://web.archive.org/, సహాయముతో ఇలాన్ మస్క్ యొక్క ట్వీట్స్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను పరీక్షించాము, కాని ఇక్కడ కూడా వైరల్ స్క్రీన్ షాట్ కు సంబంధించి మాకు ఎలాంటి సమాచారము లభించలేదు.
స్క్రీన్ షాట్స్ ను మరింత నిశితంగా పరిశీలించగా, మాకు వైరల్ స్క్రీన్ షాట్ యొక్క ఆకృతి ట్విట్టర్ యొక్క ఆకృతి కంటే భిన్నంగా ఉందని మేము కనుగొన్నాము.
దర్యాప్తును మరింత ముందుకు కొనసాగించి మేము గూగుల్ webcache సహాయముతో ఇలాన్ మస్క్ యొక్క ఆర్కైవ్ వర్షన్ ను స్కాన్ చేయడం ప్రారంభించాము, కాని ఇక్కడ కూడా వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన ఎలాంటి సమాచారము లభించలేదు. చాలా కీవర్డ్స్ సహాయముతో మేము గూగుల్ పై కూడా సెర్చ్ చేశాము. కాని మళ్ళీ వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారము లేదా మీడియా రిపోర్ట్ ఏదీ మాకు లభించలేదు.
ఈ క్లెయిమ్ 2018 నుండి సోషల్ మీడియా పై వైరల్ అయ్యింది అని మేము కనుగొన్నాము. నిజానికి, 2018 లో, ఇలాన్ మస్క్ ట్వీట్ చేశారు మరియు ఇలా అన్నారు – ‘ అతనికి ఫేస్ బుక్ అంటే ఏమిటో తెలియదు. అతనికి ఫేస్ బుక్ అంటే ఇష్టంలేదు’. దీనికి స్పందిస్తూ, ఒక యూజర్ ఫేస్ బుక్ నుండి మీ కంపెనీ పేజ్ ను తొలగించండి అని అన్నారు. అప్పుడు ఇలాన్ మస్క్ స్పందించి తన కంపెనీకి ఒక ఫేస్ బుక్ పేజ్ ఉంది అని తనకు తెలియదు అని అన్నారు.’ నేను వాటిని తొలగిస్తాను, అవి మందకొడిగా ఉన్నాయి.’ దీని తరువాత, కమెడియన్ జేమ్స్ ష్లార్మన్ ఒక వ్యాసాన్ని వ్యంగ్యంగా వ్రాస్తూ ఇలాన్ మస్క్ తొందరలోనే ఫేస్ బుక్ ను కొనుగోలు చేస్తారని ఆ తరువాత దానిని తొలగిస్తారని ఆయనను అవహేళన చేశారు. ఈ నివేదికకు స్పందిస్తూ, ఇలాన్ మస్క్ నాకు అసలు ఫేస్ బుక్ అంటే ఇష్టం లేదు. అలా నేను ఎప్పటికీ చేయను, అని అన్నారు.
మరింత సమాచారము కొరకు మేము మెయిల్ ద్వారా ఇలాన్ మస్క్ బృందాన్ని సంప్రదించాము. స్పందన అందిన తరువాత నివేదిక అప్డేట్ చేయబడుతుంది.
దర్యాప్తు చివరిలో, మేము క్లెయిమ్ షేర్ చేసిన ఫేస్ బుక్ యూజర్ ఏంజిలో బేన్స్ జూ యొక్క ఖాతాను స్కాన్ చేశాము. స్కానింగ్ ద్వారా ఈ యూజర్ దుబాయ్ నివాసి అని మరియు ఫేస్ బుక్ పై ఆయనకు 455 మంది అనుసరిస్తున్నారని తెలుసుకున్నాము.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ వారు చేసిన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని తేలింది. ఇలాన్ మస్క్ ఇటువంటి ట్వీట్ ఏదీ చేయలేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923