X
X

Fact Check: లెబనాన్ బీరట్ విమానాశ్రయముపై దాడిగా ఆరోపించబడుతున్న వైరల్ ఫోటో AI ద్వారా ఉత్పన్నం చేయబడిందని కనుగొనబడింది

వైరల్ చిత్రము అసలైనది కాదని, అది ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) ద్వారా ఉత్పన్నం చేయబడిందని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది.

  • By: Umam Noor
  • Published: Oct 31, 2024 at 04:36 PM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఇజ్రాయెల్ మరియు లెబెనాన్ ల మధ్య యుద్ధం కొనసాగుతోంది మరియు ఈ ఉద్రిక్తత మధ్య సోషల్ మీడియాపై ఒక చిత్రము వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఒక విమానము పేలుడు మంటల దగ్గర ఎగురుతున్నట్లు ఉన్న ఒక విమానాశ్రయము వద్ద పేలుడును చూపుతుంది. ఇది లెబెనాన్ బీరట్ విమానాశ్రయముపై దాడిని చూపుతుంది అని క్లెయిమ్ చేస్తూ యూజర్లు ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.

వైరల్ చిత్రము అసలైనది కాదని, అది ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) ద్వారా ఉత్పన్నం చేయబడిందని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

వైరల్ పోస్ట్ ను షేర్ చేస్తూ, ఫేస్‎బుక్ యూజర్ ఖయాల్ ఖాన్ ఇలా వ్రాశారు, “లెబెనాన్ లోని బీరట్ విమానాశ్రయములో ప్రస్తుత పరిస్థితి.”

పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు

మేము మా దర్యాప్తును వైరల్ చిత్రాన్ని గూగుల్ లెన్స్ ద్వారా సెర్చ్ చేస్తూ ప్రారంభించాము. ఈ ఫోటో మాకు  ‘ఓఎస్‎ఐఎన్‎టి డిఫెండర్’ యొక్క ధృవీకరించబడిన X-హ్యాండిల్ పై లభించింది. ఈ చిత్రము AI ఉపయోగించి సృష్టించబడిందని ఇది ధృవీకరించింది.

అదనంగా, ఈ ఫోటో  ‘ఐ ఆఫ్ లెబెనాన్’,  అనే ఇన్స్టాగ్రాం హ్యాండిల్ పై షేర్ చేయబడింది, ఇది ఈ చిత్రము AI-ద్వారా ఉత్పన్నం చేయబడిందని ధృవీకరించింది.

డిజిటల్ ధృవీకరణ నిపుణులు హెంక్ వాన్ ఈఎస్‎ఎస్ వైరల్ చిత్రము గురించి X పై పోస్ట్ చేస్తూ, ఈ చిత్రము AI ద్వారా ఉత్పన్నం చేయబడిందని సూచించే సూచన ఇచ్చింది. ఈ పోస్ట్ లో ఇలా వ్రాయబడింది, “1. విమానము టేక్ ఆఫ్ లేదా ల్యాండ్ అవుతున్నట్లు కనిపిస్తోంది, ఇది బాంబు దాడి జరిగిన ప్రదేశములో జరిగే అవకాశం లేదు. సంఘర్షణ ప్రాంతాలలో విమానాశ్రయాలు సాధారణంగా కార్యకలాపాలను నిలిపివేస్తాయి, ముఖ్యంగా వైమానిక దాడులు జరిగే సమయములో. ట్వీట్ సూచించినట్లు, ఒకవేళ బీరట్ లో ‘ఇజ్రాయెల్ బాంబు’ దాడులు జరుగుతూ ఉంటే, భద్రత కొరకు విమానాలను నిలిపివేసే అవకాశం ఉంది. 2. ప్రకాశవంతమైన పేలుళ్ళు మరియు ఒక విమానము యొక్క సిల్హౌట్ తో ఇది ఒక నాటకీయ చిత్రము. ఇందులో సినిమా లక్షణాలు ఉన్నాయి, ఇది వార్తా ఫోటోలకు అసాధారణమైనది. ఇది ఈ చిత్రము భావోద్వేగ స్పందనను ప్రేరేపించుటకు సందర్భం లేకుండా ఉపయోగించబడిందని సూచిస్తుంది.

దీని ఆధారంగా, మేము వైరల్ చిత్రాన్ని AI ద్వారా ఉత్పన్నం చేయబడిన చిత్రాలను కనుగొనుటకు రూపొందించబడిన సాధనము ‘సైట్ ఇంజన్’ పై అప్లోడ్ చేయడం ద్వారా మా దర్యాప్తును కొనసాగించాము. ఇది ఈ చిత్రము AI ద్వారా ఉత్పన్నం చేయబడిందని 99% సంభావ్యతను సూచించింది.

తరువాత మేము మరొక టూల్ హగ్గింగ్ ఫేస్ తో చిత్రాన్ని పరీక్షించాము. ఇది కూడా ఈ చిత్రము AI ద్వారా ఉత్పన్నం చేయబడిందని 94% సంభావ్యతను సూచించింది.

అదనంగా, మేము AI నిపుణుడు భార్గవ్ వలెరాను కలిశాము, ఆయన కూడా ఈ చిత్రము AI ద్వారా ఉత్పన్నం చేయబడిందని ధృవీకరించారు.

ANI నివేదిక  ప్రకారము, అక్టోబరు 20, 2024 నాడు బీరట్ అంతర్జాతీయ విమానాశ్రయములో జరిగిన పేలుడు తరువాత అక్టోబరు 21, 2024 నాడు గందరగోళం నెలకొంది. ఈ విషయముపై తదుపరి వివరాలు బిబిసి వెబ్సైట్ పై అందుబాటులో ఉన్నాయి.

చివరిగా, వైరల్ ఫోటోను షేర్ చేసిన యూజర్ యొక్క ఫేస్‎బుక్ ప్రొఫైల్ ను స్కాన్ చేశాము. ఈ యూజర్ కు 5000 ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.

ముగింపు:  విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ చిత్రము నిజమైనది కాదని, అది బీరట్ పేలుడు వర్ణించే AI ద్వారా ఉత్పన్నం చేయబడినదని వెల్లడి అయ్యింది.

  • Claim Review : Users are sharing the image claiming it shows an attack on Lebanon's Beirut airport.
  • Claimed By : Facebook user Khyal Khan
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later