Fact Check: సిఎం యోగి మోకాలి నొప్పి గురించి మాట్లాడుతున్న వైరల్ క్లిప్ నకిలీది
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు అది నకిలీది అని కనుగొనింది. సిఎం యోగి ఆదిత్యనాథ్ యొక్క వైరల్ వీడియో డీప్‌ఫేక్ వీడియో. అసలైన వీడియోలో ఆయన యూపిలో పర్యాటకం గురించి మాట్లాడుతున్నారు.
- By: Ashish Maharishi
- Published: Oct 9, 2024 at 11:54 AM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చూపిస్తున్నఒక వీడియో సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది, ఇందులో ఆయన మోకాలి నొప్పి గురించి చర్చించారు మరియు మరింత సమాచారము కొరకు ఒక బ్లాగ్ ను సందర్శించాలని వీక్షకులను ప్రోత్సహించారు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు అది నకిలీది అని కనుగొనింది. సిఎం యోగి ఆదిత్యనాథ్ యొక్క వైరల్ వీడియో డీప్‌ఫేక్ వీడియో. అసలైన వీడియోలో ఆయన యూపిలో పర్యాటకం గురించి మాట్లాడుతున్నారు.
ఏది వైరల్ అవుతోంది?
ఫేస్బుక్ పేజ్ Sport 45 ఈ వీడియోను సెప్టెంబరు 30 నాడు పోస్ట్ చేసింది. దీనిలో, మోకాలినొప్పి నుండి ఎలా ఉపశమనం పొందాలి అనేదానిపై మాట్లాడుతున్న సిఎం యోగి ఆదిత్యనాథ్ ను చూడవచ్చు.
ఈ వైరల్ వీడియో నిజమే అనుకొని ఇతర యూజర్లు కూడా దీనిని షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
సిఎం యోగి యొక్క వైరల్ వీడియోను దర్యాప్తు చేయుటకు విశ్వాస్ న్యూస్ ముందుగా గూగుల్ లెన్స్ ను ఉపయోగించింది. మేము వైరల్ వీడియో నుండి అనేక కీ ఫ్రేమ్స్ ను సంగ్రహించాము మరియు సెర్చ్ చేశాము. మాకు ఒరిజినల్ వీడియో X మరియు యూట్యూబ్ లపై లభించింది.
సత్య సంగం అనే ఒక X హ్యాండిల్ సెప్టెంబరు 27, 2024 నాడు అసలైన వీడియో ను పోస్ట్ చేసింది మరియు ఇది ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భములో తీసిన వీడియో అని వ్రాసింది. ఇందులో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలా అన్నారు, “ఈరోజు దేశాన్ని మాత్రమే కాకుండా, మొత్తం ప్రపంచాన్ని పర్యాటకం వైపుకు ఆకర్షించడములో ఉత్తర్ ప్రదేశ్ విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడి నేతృత్వములో, గత సంవత్సరం 46 కోట్లకు పైగా పర్యాటకులు ఉత్తర్ ప్రదేశ్ లోని వివిధ మతపరమైన, ఆధ్యాత్మిక మరియు ఎకో-టూరిజం లేదా వారసత్వ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. ఈ పర్యాటకులు ఉత్తర్ ప్రదేశ్ కు పర్యాటకం కోసం రావడం మాత్రమే కాకుండా, వారు ఉత్తర్ ప్రదేశ్ లో ఉపాధిని సృష్టించడములో ఒక పెద్ద పాత్ర పోషిస్తారు. ఇది వారసత్వము మరియు అభివృద్ధి యొక్క అద్భుతమైన సమన్వయాన్ని పెంచడములో సహాయపడుతుంది. ఈరోజు కాశీ బాబా విశ్వనాథ్ దేవాలయము కోట్ల కొలది పర్యాటకులను ఆకర్షిస్తోంది.”
మాకు సిఎం యోగి యొక్క అసలైన వీడియో జన్సత్తా యొక్క యూట్యూబ్ ఛానల్ పై కూడా లభించింది. ఇది సెప్టెంబరు 27 నాడు అప్లోడ్ చేయబడింది మరియు ఇక్కడ కూడా సిఎం యోగి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడడం వినవచ్చు.
వీడియోకు సంబంధీంచి మేము మా భాగస్వామి డిఏయూ (ఎంసిఏ యొక్క కార్యక్రమము) ను సంప్రదించాము. వారి దర్యాప్తులో, సిఎం యోగి ఆదిత్యనాథ్ కంఠస్వరము నకిలీది అని వారు కనుగొన్నారు. దర్యాప్తు కోసం, డిఏయూ ట్రూమీడియా, హియా మరియు హైవ్ టూల్స్ ఉపయోగించింది.
తదుపరి ధృవీకరణ కోసం విశ్వాస్ న్యూస్ సిఎం యోగి ఆదిత్యనాథ్ యొక్క మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమారు ను సంప్రదించాము. ఈ వైరల్ వీడియో నకిలీది అని ఆయన చెప్పారు.
విశ్వాస్ న్యూస్ తో మాట్లాడుతూ, బిజేపి యొక్క ఐటి మరియు సోషల్ మీడియా సభ్యుడు శశి కుమార్ కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యొక్క ఈ వైరల్ వీడియో నకిలీది అని చెప్పారు.
దర్యాప్తు చివరిలో, మేము నకిలీ వీడియోను పోస్ట్ చేసిన యూజర్ ప్రొఫైల్ ను స్కాన్ చేశాము. అతని గురించి ఎలాంటి సమాచారం లభించలేదు.
ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి మోకాలి నొప్పి చికిత్సను ప్రచారం చేస్తున్నట్లుగా చెప్పబడుతున్న సిఎం యోగి ఆదిత్యనాథ్ యొక్క వైరల్ వీడియో నకిలీది అని కనుగొనింది.
- Claim Review : మోకాలి నొప్పిపై సిఎం యోగి యొక్క వీడియో
- Claimed By : ఫేస్బుక్ యూజర్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.