కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): రిలయన్స్ ఇండస్ట్రీస్ చెయిర్‌పర్సన్, ముఖేష్ అంబానిని ఉద్దేశపూర్వకంగా చూపే ఒక వీడియో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక పెట్టుబడి పథకాన్ని సోనా అగర్వాల్ అనే మహిళకు ఆమోదిస్తున్నట్లు ఉద్దేశపూర్వకంగా వినపడుతుంది. ఈ పోస్ట్ యొక్క కవర్ ఫోటోలో ముఖేష్ అంబాని ఒక మహిళ పక్కన నిలుచుని ఉండడం చూడవచ్చు.
ఈ పోస్ట్ గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. వైరల్ అయిన వీడియో ఎడిటింగ్ మరియు ఏఐ సాంకేతికత ఉపయోగించి సృష్టించబడిన ఒక డీప్‌ఫేక్.
ఈ వాస్తవ తనిఖీని హిందీలో చదువుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఒక సోనా సూపర్’ అని పేరున్న ఒక ఫేస్బుక్ యూజర్ (ఆర్కైవ్) ఈ వైరల్ పోస్ట్ ను ఈ క్రింది టెక్స్ట్ తో షేర్ చేశారు, “భారతదేశములోని అత్యంత ధనికులైన వ్యక్తి నుండి ఒక ముఖ్యమిఅన ప్రకటన”. వీడియోలో, ముఖేష్ అంబానిగా కనిపిస్తున్న వ్యక్తి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ, భారతదేశవాసుల కోసం ఒక కొత్త పెట్టుబడి ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక ప్రకటన చేయడం చూడవచ్చు. ఆయనదిగా క్లెయిమ్ చేయబడుతున్న ఒక కఠస్వరము ఆయన ప్రాజెక్ట్ కు వ్యక్తిగత సహకారాన్ని అందిస్తానని మరియు సోనా అగర్వాల్ ను ప్రాజెక్ట్ అధికారిగా నియమించానని, సోనా యొక్క టెలిగ్రాం ఛానల్ ను వీక్షకులు సందర్శించాలని కోరుతూ డబ్బు సంపాదించుకొనుటకు ముఖేష్ అంబానితో తమ సంబంధాన్ని పేర్కొనాలని కోరింది.
ఈ పోస్ట్ గురించి దర్యాప్తు చేయుటకు, మేము ముందుగా గూగుల్ రివర్స్ ఇమే సెర్చ్ ఉపయోగించి ఆ పోస్ట్ లో ఉపయోగించిన ఫోటోను సెర్చ్ చేశాము. అసలైన ఫోటో మాకు Getty Images పై లభించింది. ఇందులో ముఖేష్ అంబాని పక్కన నిలబడిన వ్యక్తి ఆయన భార్య నీత అంబాని. అసలైన ఫోటో వెంబడి ఇలా వ్రాయబడింది: “భారతదేశపు అత్యంత ధనికుడైన వ్యక్తి మరియు ఆయిల్-టు-టెలికాం సమ్మేళనము కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చెయిర్మన్ ముఖేష్ అంబాని (ఆర్) ఆయన సతీమణి నీత అంబాని (సి) మరియు వారి కుమారుడు అనంత్ అంబాని, ముంబైలో జులై 5, 2018 నాడు కంపెనీ యొక్క 41వ ఏజిఎం కొరకు చేరుకున్నారు. భారతదేశపు ఆయిల్-టు-టెలికాం సమ్మేళనము కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, తన ఆయిల్, రిఫైనింగ్ మరియు పెట్రోకెమికల్స్ వ్యాపారాలలో గత సంవత్సరం రూపాయలు 81.51 బిలియన్ల కంటే మార్చ్ 31 నాడు ముగిసిన త్రైమాసికానికి 86.97 బిలియన్ రూపాయల నికర లాభాన్ని రికార్డ్ చేసింది. (ఫోటో సౌజన్యము ఇంద్రనీల్ ముఖర్జీ / ఏఎఫ్పి) (ఫోటో సౌజన్యము ఇంద్రనీల్ ముఖర్జీ/ఏఎఫ్పి వయా గెట్టి ఇమేజెస్ అని చదవాలి)
అసలైన చిత్రము మరియు నీతా అంబాని స్థానములో మరొక మహిళను చూపుతున్న నకిలీ చిత్రాల మధ్య వ్యత్యాసము, ఈ క్రింది కొల్లాజ్ లో చూడవచ్చు. దీని వలన మరొక మహిళ చిత్రాన్ని చొప్పించుటకు అసలైన ఫోటోను ఎడిట్ చేసారు అని తెలుస్తోంది.
ఇప్పుడు మేము ఆ వీడియోను దర్యాప్తు చేశాము. ఈ వీడియోలో లిప్ సింక్ సరిగ్గా లేదు మరియు ఆ మాండలిక భాష ముఖేష్ అంబానీ భాషతో సరిపోలలేదు. అంటే ఇది వీడియో డీప్‌ఫేక్ అని సూచిస్తుంది, ఇది ఎడిటింగ్ లేదా ఏఐ సాధనాలు ఉపయోగించి సృష్టించబడింది.
ఈ క్లిప్ పై లోతైన అవగాహన కొరకు గరిమా ప్రధాన్, దైనిక్ జాగరణ్ యొక్క వీడియో ఎడిటర్ తో మాట్లాడాము. ఆమె ఇలా అన్నారు “ఇది ఎడిట్ చేయబడిన వీడియో అని ఈ వీడియోలో లిప్ సింక్ సూచిస్తుంది. ఈరోజులలో చాలా ఏఐ సాధనాలు అందుబాటులో ఉన్నాయి, వీటి వల్ల ఇటువంటి వీడియోలను సులభంగా సృష్టించవచ్చు. అప్పుడప్పుడు, నిజమైన మరియు తారుమారుచేయబడిన కంటెంట్ ల మధ్య వ్యత్యాసాలను కనుక్కోవడం కూడా కష్టం అవుతుండి. ఎప్పుడు ఇటువంటి వీడియోలను విశ్వసించడం లేదా షేర్ చేసే ముందు వివిధ ప్లాట్ఫార్మ్స్ పై క్రాస్-రిఫరెన్సింగ్ నిర్వహించాలని సూచించబడుతోంది. ”
ఈ వీడియో లేదా అసలైన వీడియో యొక్క మూలం కనుక్కోవడానికి, మేము వైరల్ క్లిప్ యొక్క స్క్రీన్ షాట్స్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ పై సెర్చ్ చేశాము. మాకు ఈ వీడియో రిలయన్స్ జియో యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై జులై 21, 2017 పై అప్లోడ్ చేయబడి కనిపించింది. మొత్తం వీడియోలో ఎక్కడ ముఖేష్ అంబాని ఏ పెట్టుబడి పథకాన్ని ఆమోదించలేదు. ఈ వీడియోకు “రిలయన్స్ ఏజిఎం 2017 – శ్రీ. ముఖేష్ అంబాని చే జియో ఫీచర్ ఫోన్స్ విడుదల చేయబడ్డాయి । రిలయన్స్ జియో. అని శీర్షిక పెట్టారు.”
మేము రిలయన్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి, ఫ్రాంకో విలియమ్స్ ను సంప్రదించాము, ఆయన the viral post was fake వైరల్ పోస్ట్ నకిలీది అని ధృవీకరించారు.
మేము వైరల్ పోస్ట్ లో ఉన్న లింక్ గురించి సైబర్ సెక్యూరిటి నిపుణుడు అనూజ్ అగర్వాల్ తో మాట్లాడాము. ఆయన ఇలా ప్రాధాన్యీకరించారు వెరిఫై చేయబడని లింక్ పై క్లిక్ చేయడం ద్వారా సమాచార చౌర్యం జరిగే ప్రమాదం ఉండవచ్చు మరియు ఇటువంటి యూఆర్ఎల్స్ పై క్లిక్ చేయకూడదని సూచిస్తున్నాము.
ఈ లింక్ పై ఉన్న ప్రొఫైల్ చిత్రము యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్ తో మేము ఒక ప్రివాసు కోచర్ అనే ఒక ఫ్యాషన్ డిజైనర్ యొక్క ఇన్స్టాగ్రాం పేజ్ కు చేరుకున్నాము. ఈ పోస్ట్ పై ఉన్న సమాచారము ప్రకారం, చిత్రములోని మహిళ ఒక కంటెంట్ క్రియేటర్ సుఖ్నీత్ వాధ్వా.
మేము సిఖ్నీత్ వాడ్వా యొక్క ఇన్స్టాగ్రాం పేజ్ ను చెక్ చేశాము మరియు ఇదే చిత్రాన్ని కనుగొన్నాము. అయితే, ఏ పెట్టుబడి పథకముతో ఆమెకు సంబంధం ఉన్నట్లు సూచించే ఎలాంటి సమాచారం మాకు లభించలేదు.
మరింత స్పష్టీకరణ కోసం మేము ఈమెయిల్ ద్వారా సుఖ్నీత్ వాధ్వాను సంప్రదించాము. ఆమె నుండి సమాధానము అందిన తరువాత ఈ కథనము అప్డేట్ చేయబడుతుంది.
వైరల్ చిత్రాన్ని ఆసత్యపు క్లెయిమ్స్ తో షేర్ చేసిన ‘సూపర్ సోన’ అనే యూజర్ కు ఫేస్బుక్ పై సుమారుగా 500 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: ముఖేష్ అంబాని సోనా అనే ఒక మహిళకు ఒక పథకానికి అధికారాన్ని ఇవ్వడం గురించిన వైరల్ క్లెయిమ్ అసత్యము అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. వైరల్ వీడియో ఎడిట్ చేయబడిన క్లిప్ మరియు దీనిని ఒక డీప్‌ఫేక్ అని కూడా అనవచ్చు. అసత్యపు క్లెయిమ్స్ మరియు చొప్పించిన చిత్రాలతో పోస్ట్ యొక్క కవర్ ఫోటో ఎడిట్ చేయబడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క విలేఖరి కూడా ఈ వైరల్ పోస్ట్ అసత్యము అని ధృవీకరించారు. వైరల్ వీడియోలో తప్పుదోవపట్టించే, పొదగబడిన ఆడియోతో వేరొక వీడియో ఫుటేజ్ కూడా ఉంది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923