వాస్తవ తనిఖీ : మాజీ ఎన్నికల కమిషనర్ ఈవీఎం హ్యాకింగ్ పై ఈ వైరల్ ప్రకటన చేయలేదు, ఈ పోస్ట్ నకిలీది.
ముగింపు : విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో వైరల్ పోస్ట్ నకిలీది అని తేలింది. మాజీ ఎన్నికల కమీషనర్ టీ ఎస్ కృష్ణమూర్తి ఈవీఎం హ్యాకింగ్ కు సంబంధించి తన పేరున వైరల్ ప్రకటన ఎప్పుడు చేయలేదు. ఈ వార్త అవాస్తవమైనది.
- By: Ashish Maharishi
- Published: Mar 30, 2021 at 12:15 PM
విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ) : సోషల్ మీడియాలో మళ్ళీ ఒకసారి మాజీ ఎన్నికల కమిషనర్ శ్రీ. టీ. ఎస్. కృష్ణమూర్తి గారు చేశారనే ఒక నకిలీ ప్రకటన వైరల్ అవుతోంది. ఒక వార్తాపత్రిక కట్టింగ్ ను వైరల్ చేస్తూ ఈవీఎం హ్యాకింగ్ కి సంబంధించిన ప్రకటన టీ. ఎస్. కృష్ణమూర్తిగారు చేశారు అని యూజర్స్ ఈ వాదిస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ వారు వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేశారు. ఈ వైరల్ వార్త నకిలీది అని మాకు తెలిసింది. మాజీ ఎన్నికల కమిషనర్ ఈ ప్రకటన చేయలేదు. ఇదివరకు కూడా ఈ ప్రకటన చాలాసార్లు వైరల్ అయ్యింది.
ఏది వైరల్ అవుతోంది
విజయ్ పటేల్ అనే ఫేస్బుక్ యూజర్ మార్చ్ 7 నాడు ఒక వార్తాపత్రిక కట్టింగ్ ను పోస్ట్ చేశారు. దానిలో ఈ విధంగా వ్రాసారు : “గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను బీజేపీ ఈవీఎం హ్యాకింగ్ ద్వారా గెలిచింది – టీ ఎస్ కృష్ణమూర్తి, మాజీ ఎన్నికల కమీషనర్”
వైరల్ వార్తలో మాజీ ఎన్నికల ముఖ్య కమీషనర్ టీ ఎస్ కృష్ణమూర్తి గారు ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ లలో జరిగిన ఎన్నికలలో బీజేపీ హ్యాకింగ్ చేయడము కారణంగానే గెలిచింది అని చెప్పారు అని ప్రచారం చేశారు.
ఫేస్బుక్ పోస్ట్ యొక్క ఆక్స్వర్డ్ వర్షన్ ఇక్కడ చూడండి
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ వారు వైరల్ పోస్ట్ లోని వాస్తవాన్ని తెలుసుకోవడం కొరకు ముందుగా ఎన్నికల కమిషన్ ప్రతినిధి సెఫాలీ శరణ్ యొక్క సోషల్ మీడియా ఖాతాను పునర్నిర్మించారు. మాకు వీరి ట్విట్టర్ హ్యాండిల్ లో మార్చ్ 11 న అప్లోడ్ చేసిన ఒక పత్రికా ప్రకటన లభించింది. దీనిని మీరు ఇక్కడ చూడవచ్చు.
మార్చ్ 11న విడుదల చేయబడిన పత్రికా ప్రకటనలో ఇంటర్నెట్ లో మాజీ ఎన్నికల కమీషనర్ టీ ఎస్ కృష్ణమూర్తిగారి పేరున ఒక నకిలీ వైరల్ వార్తకు సంబంధించి ఒక FIR నమోదు చేయబదింది. ఈ నకిలీ వార్త ఇదివరకు కూడా మాజీ ఎన్నికల కమీషనర్ తరఫున ఖండించబడింది. ఇది మళ్ళీ ఒకసారి వైరల్ అయ్యింది. ఈ పత్రికా ప్రకటనలో మాజీ ఎన్నికల కమీషనర్ చేసిన ప్రకటన కూడా ఇవ్వబడింది. ఇందులో వైరల్ అయిన వార్త పూర్తిగా నిరాధారమైనదని చెప్పబడింది. పత్రికా ప్రకటనను ఇక్కడ క్లిక్ చేసి సవివరంగా చదవండి.
విశ్వాస్ న్యూస్ తో చేసిన సంభాషణలో ఎన్నికల కమిషన్ ప్రతినిధి సెఫాలీ శరణ్ ఈ వైరల్ పోస్ట్ నకిలీది అని తెలిపారు.
ఇప్పుడు ఈ నకిలీ పోస్ట్ ను వైరల్ చేసిన యూజర్ గురించి దర్యాప్తు చేయాలి. ఫేస్బుక్ యూజర్ విజయ్ పటేల్ గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో ఉంటారని మాకు తెలిసింది. యూజర్ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వారు.
निष्कर्ष: ముగింపు : విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో వైరల్ పోస్ట్ నకిలీది అని తేలింది. మాజీ ఎన్నికల కమీషనర్ టీ ఎస్ కృష్ణమూర్తి ఈవీఎం హ్యాకింగ్ కు సంబంధించి తన పేరున వైరల్ ప్రకటన ఎప్పుడు చేయలేదు. ఈ వార్త అవాస్తవమైనది.
- Claim Review : గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను బీజేపీ ఈవీఎం హ్యాకింగ్ ద్వారా గెలిచింది – టీ ఎస్ కృష్ణమూర్తి, మాజీ ఎన్నికల కమీషనర్
- Claimed By : Vijay Patel
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.