వాస్తవ తనిఖీ: ఇది ‘మసాలా కింగ్’ ధరంపాల్ గులాటి చివరి వీడియో కాదు, తప్పుదారి పట్టిస్తోన్న వైరల్ పోస్ట్
వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేది. యేడాది క్రితం వీడియో ఎండిహెచ్ యజమాని ధరంపాల్ గులాటి మరణించిన తర్వాత ఇప్పుడు వైరల్ అయ్యింది.
- By: Amanpreet Kaur
- Published: Dec 14, 2020 at 12:09 PM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ఎమ్‌డిహెచ్ మసాలా బ్రాండ్ యజమాని మహేష్ ధరంపాల్ గులాటి మరణించిన తరువాత, ఆయన ఆసుపత్రి బెడ్‌మీద ఉన్న చివరి క్షణాల్లో ఒక వ్యక్తిచేత దేశభక్తి గీతం పాడించుకొని విన్నారనే వాదనతో ఓ వీడియోను షేర్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ తన ఫాక్ట్ చెకింగ్ వాట్సాప్ చాట్‌బాట్ (+919599299372) లో వాస్తవ తనిఖీ కోసం ఈ దావాను అందుకుంది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పుదోవ పట్టించేదని వెల్లడయ్యింది. వైరల్ అవుతున్న ఈ వీడియో పాతది.
దావా :
‘Himanshu Singh Rajawat – Police officer Raj’ అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. “మసాలా కింగ్ మహేష్ ధరంపాల్ జీ (ఎండిహెచ్) యొక్క చివరి వీడియో ఇది, చివరిసారిగా కూడా అతని గుండె దేశం కోసం కొట్టుకుంటూనే ఉంది …” అని ఆ వీడియోకు రైటప్ ఇచ్చారు.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో క్రింద ఉన్న వ్యాఖ్యలను మేము గమనించాము. ఈ వీడియోను ఎబిపి న్యూస్ జర్నలిస్ట్ వికాస్ భడోరియా చేసిన ట్వీట్‌లో కూడా మేము కనుగొన్నాము. ట్విట్టర్ యూజర్ గగన్ అహుజా తన వ్యాఖ్యలలో వీడియోలో పాడుతున్న వ్యక్తిని అంబాలాకు చెందిన తన అన్నయ్య రాకేశ్ అహుజాగా గుర్తించడాన్ని మేము గమనించాము. గగన్ అహుజా యొక్క ఫేస్‌బుక్ పోస్ట్‌ను మేము కనుగొన్నాము, అక్కడ అతను రాకేష్ అహుజాను వైరల్ వీడియోలో ట్యాగ్ చేసాడు.
ఈ దావాను ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ రాకేశ్ అహుజాను సంప్రదించింది. ఈ వీడియో ధరంపాల్ గులాటి చివరి క్షణాల్లో తీయలేదని మాకు స్పష్టం చేసిన అహుజా, గత ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు చెప్పారు. గులాటి న్యూఢిల్లీలోని జనక్‌పురిలో ఉన్న తన సొంత ఆసుపత్రి అయిన మాతా చందన్ దేవి ఆసుపత్రిలో చేరారు. మేము అక్కడ డాక్టర్ అనుమతితో ఈ పాట పాడాము. గులాటి గారికి సంగీతం అంటే చాలా ఇష్టం, ఆయన సంగీతం విన్నప్పుడల్లా సంతోషంగా ఆ గానంలో లీనమయ్యేవారు. మేము ఆయనతో పాటు ఆనందించేవాళ్లం,’ అని అహుజా విశ్వాస్ న్యూస్‌కు చెప్పారు.
తాను అంబాలాలో ఎండిహెచ్ మసాలా దినుసుల పంపిణీదారుడినని, తాను తరచూ గులాటిని కలిసేవాడినని అహుజా తెలిపారు. “ఆయన ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్నాడని మాకు తెలిసినప్పుడు, మేము ఆయనను కలవడానికి వెళ్ళాము,” అని అహుజా చెప్పారు.
వైరల్ వీడియోను షేర్ చేసిన ఫేస్‌బుక్ పేజి యొక్క సోషల్ స్కానింగ్‌లో 45,036 మంది ఫాలోవర్లు ఉన్నారని తెలిసింది.
निष्कर्ष: వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేది. యేడాది క్రితం వీడియో ఎండిహెచ్ యజమాని ధరంపాల్ గులాటి మరణించిన తర్వాత ఇప్పుడు వైరల్ అయ్యింది.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.