X
X

తక్షణ వాస్తవ తనిఖీ : భగత్ సింగ్ సోదరి ప్రకాష్ కౌర్ 2014 లో కన్నుమూశారు, తప్పుదారి పట్టిస్తున్న వైరల్‌ పోస్ట్‌

విశ్వాస్ బృందం తన పరిశోధనలో వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా గుర్తించింది. భగత్ సింగ్ సోదరి బీబీ ప్రకాష్ కౌర్ 2014 లోనే మరణించారు.

  • By: Pallavi Mishra
  • Published: Dec 7, 2020 at 05:15 AM
  • Updated: Dec 7, 2020 at 01:27 PM

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్‌) : ఒక పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది, ఇందులో భగత్ సింగ్ సోదరి బీబీ ప్రకాష్ కౌర్ ఫోటోను చూడవచ్చు. ఈ ఫోటోతో పాటు రాసిన రైటప్‌లో ప్రకాష్ కౌర్ ఇప్పుడు మన మధ్యలో లేరని, ఈ రోజు ఆమె మరణించారని పేర్కొన్నారు.

విశ్వాస్ బృందం ఈ పోస్ట్ గురించి అంతకుముందు కూడా దర్యాప్తు చేసింది. మా దర్యాప్తులో, వైరల్ దావా తప్పుదారి పట్టించేదిగా మేము కనుగొన్నాము. భగత్ సింగ్ సోదరి బీబీ ప్రకాష్ కౌర్ 2014 లో మరణించారు.

వైరల్‌ అవుతున్నది ఏంటి?
శ్యాము యాదవ్ అనే యూజర్ నవంబర్ 21 న ఈ పోస్ట్‌ను ఐపిఎస్ పూజా యాదవ్ అనే ఫేస్‌బుక్‌ పేజీలో అప్‌లోడ్ చేశారు. ”96 సంవత్సరాల వయస్సులో, భగత్ సింగ్ చెల్లెలు ప్రకాష్ కౌర్ ఈ రోజు మనల్ని వదిలి వెళ్లారు. ఏ రాజకీయ నాయకుడూ సంతాపం తెలపలేదు. అయితే, దేశభక్తులుగా మనమందరం తప్పక నివాళి అర్పించాలి.” అని ఆ ఫోటోపైన రాశారు.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడండి.

దర్యాప్తు :
గూగుల్‌లో కీవర్డ్‌తో శోధించడం ద్వారా ఈ వైరల్‌ పోస్ట్‌ దర్యాప్తును ప్రారంభించాము. ఈ అంశానికి సంబంధించి 30 సెప్టెంబర్ 2014 న జాగరణ్‌ జోష్‌లో ప్రచురించబడిన ఒక వార్తా కథనం లింక్‌ దొరికింది. దీని శీర్షిక : భగత్ సింగ్ సోదరి బీబీ ప్రకాష్ కౌర్ అస్తమయం. (హిందీ అనువాదం: భగత్ సింగ్ సోదరి బీబీ ప్రకాష్ కౌర్ అస్తమయం) ప్రకాష్ కౌర్ కెనడాలో 94 సంవత్సరాల వయసులో మరణించారు. బీబీ ప్రకాష్ కౌర్ షహీద్ భగత్ సింగ్ 107 వ పుట్టినరోజున మరణించారు. మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఈ వార్తలను చదవవచ్చు.

దీని తరువాత, మేము షహీద్ భగత్ సింగ్ సోదరి అమర్ కౌర్ కుమారుడు ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్‌ను సంప్రదించాము. జగ్మోహన్ సింగ్ మాతో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. ఈ వైరల్ పోస్ట్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, బీబీ ప్రకాష్ కౌర్ 2014 లోనే మరణించారని ఆయన చెప్పారు. ఇది కొన్ని రాజకీయ పార్టీల ఐటి సెల్ ద్వారా వైరల్‌ చేయబడిన పోస్ట్‌ అని, చాలామంది ఈ పోస్ట్‌ ద్వారా నివాళి అర్పిస్తున్నారని, అయితే, నివాళి అర్పించడానికి కూడా సమయం ఉందని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను అని జగ్మోహన్‌సింగ్‌ చెప్పారు. ఇటువంటి పోస్టులు కరోనా మహమ్మారి మధ్యలో ప్రజలను తప్పుదారి పట్టించాయని, మీరు నిజమైన మార్గంలో నివాళి అర్పించాలనుకుంటే, బీబీ ప్రకాష్ కౌర్ మరియు భగత్ సింగ్ మాటలను పరిగణనలోకి తీసుకోండి.. మరియు ఈ కరోనా సమయంలో పేదలకు మంచి చేయండి.” అని ఆయన సూచించారు.

చాలా మంది యూజర్లు ఈ దావాను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. వాటిలో ఏక్ భారత్ అనే ఫేస్‌బుక్ పేజీ ఒకటి. ఈ పేజీని 9,98,866 మంది ఫాలో అవుతున్నారు.

ఈ కథనానికి సంబంధించిన వాస్తవ తనిఖీ పూర్తి కథనం ఇక్కడ చదవండి.

निष्कर्ष: విశ్వాస్ బృందం తన పరిశోధనలో వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా గుర్తించింది. భగత్ సింగ్ సోదరి బీబీ ప్రకాష్ కౌర్ 2014 లోనే మరణించారు.

  • Claim Review : ''96 సంవత్సరాల వయస్సులో, భగత్ సింగ్ చెల్లెలు ప్రకాష్ కౌర్ ఈ రోజు మనల్ని వదిలి వెళ్లారు. ఏ రాజకీయ నాయకుడూ సంతాపం తెలపలేదు. అయితే, దేశభక్తులుగా మనమందరం తప్పక నివాళి అర్పించాలి.
  • Claimed By : Ek Bharat
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later