వాస్తవ తనిఖీ: పశ్చిమ బెంగాల్లో ఎంఐఎంతో బిజెపి పొత్తు పెట్టుకుందంటూ తప్పుడు ట్వీట్ వైరల్
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, బిజెపి పేరిట వైరల్ అవుతున్న ట్వీట్ నకిలీదని తేలింది. బిజెపి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఈ ట్వీట్ లేదు.
- By: Ashish Maharishi
- Published: Dec 7, 2020 at 05:09 AM
- Updated: Dec 7, 2020 at 01:26 PM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ ఎన్నికలకు సంబంధించిన నకిలీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలయ్యింది. పశ్చిమ బెంగాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఎఐఎంఐఎంతో ఒప్పందం కుదుర్చుకుంటుందని కొందరు యూజర్లు బిజెపి పేరుతో నకిలీ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్టులపై దర్యాప్తు చేసింది. ఈ ట్వీట్ పూర్తిగా నకిలీదని మా దర్యాప్తులో తేలింది. బిజెపి అలాంటి ట్వీట్ చేయలేదు.
వైరల్ అవుతున్నది ఏంటి?
ఫేస్బుక్ యూజర్ అనిల్ శర్మ నవంబర్ 21 న ఒక నకిలీ ట్వీట్ పోస్ట్ చేస్తూ ఇలా రాశాడు: “గెలవడం కోసం, మీరు ఎంతవరకైనా వెళ్ళగలుగుతారు. మీరు మొదట వారితో పోరాడతారు, తరువాత వారు మీతో పోరాడుతారు, ఎవరూ ఉపాధిపై దృష్టి పెట్టరు.”
బిజెపి పేరిట వైరల్ అవుతున్న ఆ ట్వీట్లో “రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో AIMIM తో పొత్తు పెట్టుకున్నాము.” అని ప్రకటించారు.
ఫేస్బుక్ పోస్ట్ యొక్క అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
ఈ వైరల్ దావాలో వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి గూగుల్‌లో ‘ఓవైసీ బిజెపి కూటమి’ వంటి కీలక పదాలను టైప్ చేయడం ద్వారా విశ్వాస్ న్యూస్ మొదట వార్తలను శోధించడం ప్రారంభించింది. బిజెపితో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM పొత్తుకు సంబంధించిన ఎలాంటి వార్తలు మాకు దొరకలేదు, అయితే, మమతా బెనర్జీతో పాటు అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చారన్న వార్తలు కనిపించాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించడంలో తృణమూల్ కాంగ్రెస్‌కు తమ పార్టీ సహాయం చేస్తుందని ఓవైసీ మమతతో ముందస్తు పోల్ కూటమికి ప్రతిపాదించినట్లు నవంబర్ 19 న జాగరణ్.కామ్‌లో ప్రచురించిన కథనం పేర్కొంది. మీరు ఈ మొత్తం వార్తా కథనాన్ని ఇక్కడ చదవవచ్చు.
దర్యాప్తు తదుపరి దశలో, మేము బిజెపి యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అయిన బిజెపి 4 ఇండియాను స్కాన్ చేయడం ప్రారంభించాము. వైరల్ అవుతున్న ఈ ట్వీట్ ఈ ట్విట్టర్ హ్యాండిల్లో చేయలేదని గుర్తించడం జరిగింది. నవంబర్ 20 న, బిజెపి ట్విట్టర్ హ్యాండిల్‌పై ఒక ట్వీట్ గుర్తించాము. ఇందులో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా.. ఒవైసీ పార్టీని సోషల్ బ్రోకర్ అని అభివర్ణించారు. ఈ ట్వీట్‌ను ఇక్కడ చూడవచ్చు.
ఈ నకిలీ ట్వీట్‌పై విశ్వాస్ న్యూస్ బిజెపి అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గాను సంప్రదించింది. వైరల్ అవుతున్న ట్వీట్ నిజం కాదని ఆయన స్పష్టం చేశారు.
చివరగా, మేము ఈ నకిలీ పోస్ట్ చేసిన యూజర్ అకౌంట్‌ను సోషల్ స్కానింగ్ చేశాము. ఈ యూజర్ అనిల్ శర్మ న్యూఢిల్లీ వాసి అని మాకు తెలిసింది.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, బిజెపి పేరిట వైరల్ అవుతున్న ట్వీట్ నకిలీదని తేలింది. బిజెపి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఈ ట్వీట్ లేదు.
- Claim Review : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి AIMIM తో ఒప్పందం కుదుర్చుకుంది.
- Claimed By : ఫేస్బుక్ యూజర్ అనిల్ శర్మ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.