తక్షణ వాస్తవ తనిఖీ: బంగ్లాదేశ్ నేరస్థుడి ఫోటో కాంగ్రెస్ నాయకుడి పేరిట మరోసారి వైరల్
అసోం నాయకుడిగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్నది బంగ్లాదేశ్‌కు చెందిన మదర్సా టీచర్ అని మా దర్యాప్తులో తేలింది. వైరల్ పోస్ట్ అబద్ధం.
- By: Pallavi Mishra
- Published: Nov 6, 2020 at 07:18 PM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో 2 ఫోటోలతో కూడిన ఓ ఇమేజ్ వైరల్ అవుతోంది. అసోంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమ్జత్ అలీని యాపిల్స్ బాక్స్‌లో ఆయుధాలు మరియు బుల్లెట్లను తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. విశ్వాస్ టీమ్ కూడా ఈ పోస్ట్ గురించి అంతకుముందే దర్యాప్తు చేసింది. ఆ సమయంలో విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో ఈ పోస్ట్ నకిలీదని నిరూపించబడింది.
వైరల్ పోస్ట్‌లో ఏముంది ?
ఫేస్‌బుక్ యూజర్ ‘అనురాగ్ అగ్నిహోత్రి’ ఈ పోస్ట్‌ను నవంబర్ 2వ తేదీన అప్‌లోడ్ చేశారు. మొదటి ఫోటోలో కొంతమంది భద్రతా సిబ్బంది బంధించిన ఒక వ్యక్తిని చూడవచ్చు మరియు రెండవ ఫోటోలో ఒక యాపిల్ పెట్టె మరియు ఆయుధాలను చూడవచ్చు. ఈ ఫోటోకింద రైటప్ ఇలా ఉంది, “#असम के कांग्रेस नेता अमजात अली सेब की पेटी में हथियार और गोलियां के साथ हिरासत में। काफिरो को मारने का कर रहा था प्लान। पुलिस ने दबोचा।। इनकी पूरी तैयारी है #हिंदुओ”
వైరల్ పోస్ట్ యొక్క అర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
వైరల్ అవుతున్న ఫోటో యొక్క వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి, మేము రెండు ఫోటోలను విడిగా కత్తిరించి గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా శోధించాము. మొదటి ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో బెంగాలీలో రాసిన బ్లాగుకు సంబంధించిన లింక్ దొరికింది. దాని ప్రకారం, “ముబారక్ హుస్సేన్ అనే ఉపాధ్యాయుడిని లైంగిక వేధింపుల ఆరోపణలపై 2018 లో బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు.”
మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా రెండవ ఫోటోను శోధించినప్పుడు greatkashmir.com కు సంబంధించిన లింక్‌ను కనుగొన్నాము. ఈ ఫోటోను 29 అక్టోబర్ 2018 న ప్రచురించిన ఓ వార్తా కథనంలో ఉపయోగించారు. “శ్రీనగర్ శివార్లలో పెద్ద మొత్తంలో ఆయుధాలు దొరికాయి” అని దాని క్యాప్షన్‌లో రాశారు.
దీని తరువాత, అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెబ్‌సైట్‌లో అమ్జత్ అలీ అనే నాయకుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాము. అలాంటి నాయకుడి పేరు మాకు ఎక్కడా దొరకలేదు.
దీన్ని ధృవీకరించడానికి మేము అసోం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రిపూన్ బోరాను సంప్రదించాము. ఆయన ‘ఈ పోస్ట్ నిరాధారమైనది. అస్సాం కాంగ్రెస్‌లో అమ్జత్ అలీ అనే నాయకుడు లేడు.’ అని బదులిచ్చారు.
చివరికి, మేము ఈ నకిలీ పోస్ట్‌ను షేర్ చేసిన వినియోగదారుని ఖాతాను సోషల్ స్కానింగ్ చేశాము. Anurag Agnihotri ఢిల్లీకి చెందినవాడు.
ఈ కథనానికి సంబంధించిన దర్యాప్తు పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చదవవచ్చు.
निष्कर्ष: అసోం నాయకుడిగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్నది బంగ్లాదేశ్‌కు చెందిన మదర్సా టీచర్ అని మా దర్యాప్తులో తేలింది. వైరల్ పోస్ట్ అబద్ధం.
- Claim Review : అసోంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమ్జత్ అలీని యాపిల్స్ బాక్స్‌లో ఆయుధాలు మరియు బుల్లెట్లను తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కాఫిరోను చంపడానికి అతను పథకం వేశాడు. పోలీసులు అరెస్టు చేశారు.
- Claimed By : Anurag Agnihotri
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.