వాస్తవ తనిఖీ: ఆన్‌లైన్ క్లాసులు వింటున్న పిల్లలందరికీ మోడీ ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదు, ఇది పాత పుకారే మళ్లీ వైరల్
ఆన్‌లైన్ క్లాసుల ద్వారా ఇంట్లో చదువుతున్న విద్యార్థులకు మోడీ ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లను ఉచితంగా ఇవ్వడం లేదు. ఈ వీడియోలో పేర్కొన్న పథకం పేరిట ఓ అప్లికేషన్ ప్రచారం చేయబడుతోంది. క్లిక్‌బైట్ ప్రోత్సహించే ఏ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలని సైబర్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
- By: ameesh rai
- Published: Oct 1, 2020 at 04:35 PM
- Updated: Jul 17, 2024 at 05:59 PM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): ఒక వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఇంటినుంచి ఆన్‌లైన్‌లో క్లాసులు వింటూ చదువుకుంటున్న పిల్లలకు మోడీ ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లను ఇస్తోందని పేర్కొన్నారు. విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్ (+91 95992 99372) లో ఫ్యాక్ట్ చెక్ కోసం ఈ దావాను కూడా స్వీకరించింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందనే ఈ ప్రచారం ఇంతకు ముందు కూడా వివిధ రూపాల్లో వైరల్ అయ్యింది.
వైరల్ అవుతున్నది ఏంటి?
విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్‌లో ఫ్యాక్ట్ చెక్ కోసం వీడియో పోస్ట్‌ను అందుకుంది. మా వినియోగదారు యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియోను వాస్తవ తనిఖీ కోసం పంపారు. ఈ వీడియోలో, ఇంట్లో ఆన్‌లైన్ ద్వారా చదువుకునే పిల్లలకు, ఇంట్లో ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, కెమెరాలు లేని పిల్లల కోసం మోడీ ప్రభుత్వం ఈ ఉచిత ల్యాప్‌టాప్ పథకాన్ని తీసుకువచ్చిందని ఆశ కల్పించారు. పిల్లల పేరు, తరగతి, ఆధార్ కార్డు నెంబర్ వంటి వివరాలను ఫారమ్‌లో నింపి సబ్‌మిట్ చేసిన తర్వాత ల్యాప్‌టాప్ ఉచితంగా వస్తుందని ఈ యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు.
ఈ యూట్యూబ్ వీడియోను ఆర్కైవ్ చేసిన లింక్‌ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ మొదట ఈ వైరల్ యూట్యూబ్ వీడియోను నిశితంగా గమనించింది. ఈ వీడియో 3 నిమిషాల 13 సెకన్ల నిడివి ఉంది. ఈ వీడియోను రూపొందించడంలో, యుపి ప్రభుత్వం పాత ల్యాప్‌టాప్ పథకానికి సంబంధించిన గతంలోని వార్తా కథనాన్ని షేర్ చేశారు. అయితే, నిజంగానే ఈ పథకం భారత ప్రభుత్వానికి చెందినది అనుకున్నా.. విద్యార్థులు వారి వివరాలు ఎక్కడ నమోదు చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్కడా సూచించలేదు.
ఈ వీడియో 1 నిమిషం 50 సెకన్ల తర్వాత ఒక అప్లికేషన్ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చామని.. దానిని డౌన్‌లోడ్ చేయడం ద్వారా ల్యాప్‌టాప్ పొందవచ్చని పేర్కొన్నారు. అంటే, ఉచిత ల్యాప్‌టాప్ పేరుతో ప్రచారం చేసిన పథకానికి బదులుగా, మరో అప్లికేషన్ ప్రచారం చేయబడుతోంది.
వైరల్ పోస్ట్ వివరణ మేరకు వీడియో డిస్క్రిప్షన్‌లో షేర్ చేసిన లింక్‌ను కూడా విశ్వాస్ న్యూస్ తనిఖీ చేసింది. ఈ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, మేము సోషల్ మీడియా వంటి వీడియో ఆధారిత ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నాము. ఈ లింక్‌ను సందర్శించిన తరువాత, దాన్ని ఇన్‌స్టాల్ చేయమని అభ్యర్థన వచ్చింది. దీనితో పాటు, ఏదైనా రివార్డ్, లాటరీ, ఉచిత రీఛార్జ్ వంటి తప్పుడు సమాచారం మీద భరోసా పెట్టుకోవద్దని పేర్కొంది.
ఉచిత ల్యాప్‌టాప్ పథకం పేరుతో ప్రచారం చేస్తున్న వాళ్లు తమకు సంబంధించిన మరో లింక్‌ను ప్రమోట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ యూట్యూబ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ప్రైజ్ పేరుతో (చౌకబారు ప్రయోగం) ప్రమోషన్ చేసుకుంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో భాగంగా మరింత శోధించింది. అవసరమైన కీలకపదాల సహాయంతో ఇంటర్నెట్‌లో ఈ దావాను శోధించింది. కేంద్ర ప్రభుత్వ ఉచిత ల్యాప్‌టాప్‌ల వంటి ఏదైనా పథకాన్ని ధృవీకరించే ప్రామాణికమైన నివేదికలు మాకు దొరకలేదు. భారత ప్రభుత్వం అలాంటి పథకం ప్రవేశపెట్టి ఉంటే, అది ప్రామాణికమైన మీడియా సంస్థలపై లేదా అధికారిక వెబ్‌సైట్లలో మరియు ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పేర్కొనబడి ఉండేది. దీనికి విరుద్ధంగా, మాకు అలాంటి పాత ప్రామాణికమైన నివేదికలు వచ్చాయి, ఇందులో ఉచిత ల్యాప్‌టాప్ పథకం పేరిట నకిలీ ప్రచారంతో మోసం జరుగుతోందని పేర్కొంది.
2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇలాంటి ఉచిత ల్యాప్‌టాప్ పథకానికి సంబంధించిన వాదనలు వైరల్ అయ్యాయి. ప్రధాని మోడీ మళ్లీ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఆనందంలో 2 కోట్ల ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్నట్లు అప్పుడు పేర్కొన్నారు. దానికి సంబంధించి BBC వార్తా కథనాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
ఉచిత ల్యాప్‌టాప్ పథకం పేరిట వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, క్లిక్‌బైట్ ద్వారా చేసిన మోసపూరిత సంపాదనకు సంబంధించి ఓ కేసు కూడా నమోదయ్యింది. జూన్ 2019లో రాకేశ్ జంగిద్ అనే యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి కేంద్ర ప్రభుత్వం నుంచి 2 కోట్ల ల్యాప్‌టాప్‌లు పొందవచ్చని ఆశపెడుతూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడని పోలీసులు ఆరోపించారు. యువకుడి అరెస్టుకు సంబంధించిన ANI వార్తా సంస్థ ట్వీట్ కింద చూడవచ్చు:
ఈ ఉచిత ల్యాప్‌టాప్ పథకానికి సంబంధించి విశ్వాస్ న్యూస్ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఆయుష్ భరద్వాజ్‌తో మాట్లాడటం జరిగింది. ఇలాంటి వాదనలు డిజిటల్ ప్రపంచంలో నిరంతరం వైరల్ అవుతున్నాయని ఆయన అన్నారు. ఇలాంటివి ప్రధానంగా రెండు ప్రయోజనాల కోసం జరుగుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ వైరల్ వీడియో విషయంలో ఉచిత ల్యాప్‌టాప్ పథకం ముసుగులో, లింక్ లేదా నకిలీ అప్లికేషన్ ప్రచారం చేయబడుతోందని ఇది మొదటి ప్రయోజనమని, అలాగే.. నకిలీగాళ్లు క్లిక్‌బైట్‌కు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. అటువంటి పథకాలకు సంబంధించినవి చూసినప్పుడు, ప్రజలు లింక్‌పై క్లిక్ చేస్తారు, ఇది ఆ లింక్ తయారు చేసిన వాళ్లు అక్రమంగా సంపాదించడానికి సాధనంగా మారుతుందని అన్నారు. ‘ఇటువంటి మోసాలకు సంబంధించి రెండవ ప్రయోజనం చాలా ప్రమాదకరమైనది. దీనిలో, క్లిక్‌బైట్ సహాయంతో, యూజర్ల మొబైల్‌లోకి మాల్‌వేర్‌కు సంబంధించిన లింక్ పంపించి ఆ డివైజ్‌మీద నియంత్రణ సాధించవచ్చు. అలా ఆ యూజర్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారం డీప్ వెబ్‌లో దొంగిలిస్తారు. ఆ సమాచారాన్ని అమ్ముకుంటారు. (హ్యాకర్లు మరియు సైబర్ మోసగాళ్ళు డీప్ వెబ్‌ను ఉపయోగిస్తారు). మాల్‌వేర్ సహాయంతో, ఇ-వాలెట్లు కూడా హ్యాక్ చేయబడతాయి, ఫలితంగా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి యూజర్లు ఎవరూ అలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు, అలాంటి క్లిక్‌బైట్‌లో ప్రచారం చేయబడుతున్న ఏ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు’ అని ఆయుష్ స్పష్టంగా వివరించారు.
निष्कर्ष: ఆన్‌లైన్ క్లాసుల ద్వారా ఇంట్లో చదువుతున్న విద్యార్థులకు మోడీ ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లను ఉచితంగా ఇవ్వడం లేదు. ఈ వీడియోలో పేర్కొన్న పథకం పేరిట ఓ అప్లికేషన్ ప్రచారం చేయబడుతోంది. క్లిక్‌బైట్ ప్రోత్సహించే ఏ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలని సైబర్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
- Claim Review : ఆన్‌లైన్ క్లాసుల ద్వారా ఇంట్లో ఉండి చదువుకుంటున్న పిల్లలకు మోడీ ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లను ఇస్తోంది.
- Claimed By : ఆన్‌లైన్ క్లాసుల ద్వారా ఇంట్లో ఉండి చదువుకుంటున్న పిల్లలకు మోడీ ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లను ఇస్తోంది.
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.