X
X

వాస్తవ తనిఖీ: కరాచీలో జరిగిన దుర్ఘటన హైదరాబాద్‌లో జరిగినట్లు వైరల్‌ అవుతోంది, ఈ పోస్ట్‌ అబద్ధం.

విశ్వాస్‌ న్యూస్‌ దర్యాప్తులో హైదరాబాద్ పేరిట వైరల్ అవుతున్న పోస్ట్ తప్పు అని నిరూపించబడింది. పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన ఈ సంఘటనను కొంతమంది భారతదేశంలోని హైదరాబాద్‌లో జరిగినట్లు పేర్కంటూ వైరల్‌ చేస్తున్నారు.

  • By: Ashish Maharishi
  • Published: Aug 14, 2020 at 04:51 PM
  • Updated: Sep 3, 2020 at 04:52 PM

హైదరాబాద్‌ (విశ్వాస్‌ న్యూస్) : ఓ బాధాకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో, ఒక భారీ హోర్డింగ్‌ బలమైన తుఫాను గాలికి విడిపోయి రోడ్డుపై పడటం చూడవచ్చు. ఈ హోర్డింగ్‌ మీదపడి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది హైదరాబాద్‌లో జరిగిందని పేర్కొంటూ వైరల్ చేస్తున్నారు.

విశ్వాస్‌ న్యూస్ ఈ వైరల్ పోస్టులపై దర్యాప్తు చేసింది. దర్యాప్తులో వైరల్ పోస్ట్ తప్పు అని తేలింది. వాస్తవానికి, పాకిస్తాన్‌లో జరిగిన ఈ దుర్ఘటన భారతదేశంలోని హైదరాబాద్ పేరిట వైరల్ అవుతోంది.

వైరల్‌ అవుతున్నది ఏంటి ?
‘షేక్ జియా ఉల్ గఫర్ పేజ్ హైదరాబాద్’ ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు: ‘మెహదీపట్నం, హైదరాబాద్ ఇండియా # షేర్’

ఈ వీడియోను ఆగస్టు 11వ తేదీన అప్‌లోడ్ చేశారు. దీనిని నిజమని భావించి, చాలామంది సోషల్‌ మీడియా యూజర్లు సర్క్యులేట్‌ చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.
ఈ పోస్ట్ యొక్క ఫేస్‌బుక్ లింక్‌ ఇక్కడ చూడొచ్చు.

అలాగే, అర్కైవ్‌ వెర్షన్‌ ఇక్కడ చూడండి.

దర్యాప్తు :
విశ్వాస్‌ న్యూస్‌ ఈ వైరల్ వీడియో నుండి అనేక స్క్రీన్‌షాట్‌లను తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్‌లో శోధించింది. మేము ఈ వీడియోను చాలా యూట్యూబ్ ఛానెళ్లలో కనుగొన్నాము. ఆగస్టు 8వ తేదీన, ‘డైలీ డోస్ ఆఫ్ ఖోస్’ అదే వీడియోను అప్‌లోడ్ చేసింది మరియు పాకిస్తాన్‌లో తుఫాను సమయంలో భారీ హోర్డింగ్‌ మోటారుసైకిల్ రైడర్‌పై పడిందని రాసింది. పూర్తి వీడియో ఇక్కడ చూడండి.

https://youtu.be/GlZEIgeViPw

ఆ తర్వాత మేము గూగుల్ సెర్చ్ ద్వారా పాకిస్తాన్‌కు సంబంధించిన వార్తలను శోధించాము. శోధన సమయంలో, ఓ వెబ్‌సైట్‌లో ఈ ప్రమాదానికి సంబంధించిన వార్తలను మేము కనుగొన్నాము. కరాచీలోని మెట్రోపోల్ హోటల్ సమీపంలో భారీ వర్షాల సమయంలో భారీ హోర్డింగ్‌ రోడ్డుపై పడిందని ట్రిబ్యూన్ వార్తల్లో పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మోటార్‌ సైకిల్ రైడర్లు గాయపడ్డారు. ఈ సంఘటన ఆగస్టు 6వ తేదీన జరిగింది. మీరు మొత్తం వార్తను ఇక్కడ చదవవచ్చు.

దర్యాప్తులో భాగంగా, తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనథం చేసిన ఒక ట్వీట్ కనుగొన్నాము. ఆగస్టు 10వ తేదీన చేసిన ఆ ట్వీట్‌లో, ఆ సంఘటన హైదరాబాద్‌లో జరిగినట్లు వైరల్‌ అవుతుండటాన్ని కొనథమ్ ఖండించారు. కొంతమంది హైదరాబాద్‌ను ప్రస్తావిస్తూ కరాచీ వార్తలను వైరల్ చేస్తున్నారని ప్రస్తావించారు. ట్వీట్ పూర్తి సారాంశం పరిశీలించండి.

వైరల్ పోస్ట్ గురించి, ఇటువంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం నేరం అని దిలీప్ కొనథం చెప్పారు. ఇప్పటికీ కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా పాకిస్తాన్ వీడియోను హైదరాబాద్‌లో జరిగినట్లుగా వైరల్ చేస్తున్నారు. నిజం తెలియకుండా ఇలాంటి పోస్ట్‌ను ఫార్వార్డ్‌ చేయవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. అన్నారు.

చివరికి మేము ఈ నకిలీ పోస్ట్ చేసిన యూజర్‌ ప్రొఫైల్‌ను విచారించడం జరిగింది. షేక్ జియా ఉల్ గఫర్ పేజ్ అనే ఈ పేజీని 1.22 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారని మాకు తెలిసింది. ఈ ఫేస్‌బుక్‌ పేజీ 2016, ఫిబ్రవరి 26వ తేదీన సృష్టించబడింది.


निष्कर्ष: విశ్వాస్‌ న్యూస్‌ దర్యాప్తులో హైదరాబాద్ పేరిట వైరల్ అవుతున్న పోస్ట్ తప్పు అని నిరూపించబడింది. పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన ఈ సంఘటనను కొంతమంది భారతదేశంలోని హైదరాబాద్‌లో జరిగినట్లు పేర్కంటూ వైరల్‌ చేస్తున్నారు.

  • Claim Review : ఈ ప్రమాదం హైదరాబాద్‌లో జరిగింది.
  • Claimed By : Shaykh Zia Ul Gaffar Page
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later