Fact Check: డొనాల్డ్ ట్రంప్ విజయ ప్రసంగము సమయములో జన సమూహము ప్రధాని మోడిగారి పేరు పలకలేదు, అసత్యపు క్లెయిమ్ వైరల్ అయ్యింది
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. జన సమూహము రాబర్ట్ ఎఫ్ కెన్నెడి జూ. మద్ధతుగా ఆయన పేరు పేర్కొనబడినప్పుడు “బాబి-బాబి’ అని పలికారు, ‘మోడి మోడి’ అని కాదు.
- By: Pallavi Mishra
- Published: Nov 20, 2024 at 12:18 PM
కొత్త ఢిల్లీ, విశ్వాస్ న్యూస్. రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందారు మరియు నాలుగు-సంవత్సరాల తరువాత తిరిగి వైట్ హౌస్ కు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఆయన తన విజయ ప్రసంగములో, తన మద్ధతుదారులు మరియు బృందము అందరికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ట్రంప్ యొక్క విజయ ప్రసంగము సమయములో జన సమూహము “మోడి మోడి” అని అరిచారనే క్లెయిమ్ తో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. జన సమూహము రాబర్ట్ ఎఫ్ కెన్నెడి జూ. మద్ధతుగా ఆయన పేరు పేర్కొనబడినప్పుడు “బాబి-బాబి’ అని పలికారు, ‘మోడి మోడి’ అని కాదు.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
నవంబరు 6, 2024 నాడు , ఫేస్బుక్ యూజర్ ‘ది లెజెండ్ లామా’ ‘డొనాల్డ్ జాన్ ట్రంప్ యొక్క విజయ ప్రసంగము సమయములో జన సమూహము ‘మోడి మోడి’ అని పలికారు అనే శీర్షికతో ఈ వైరల్ వీడియోను షేర్ చేశారు. వీడియో వివరణలో ‘ట్రంప్ దేశములో మోడి మాయాజాలం’ అని వ్రాయబడింది.
దర్యాప్తు
వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేయుటకు, మేము డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రసంగాన్ని పూర్తిగా వినాలని నిర్ణయించుకున్నాము. మాకు ABC న్యూస్ యూ ట్యూబ్ ఛానల్ పై నవంబరు 6, 2024 నాడు పోస్ట్ చేయబడిన పూర్తి ప్రసంగము లభించింది. ఆయన ప్రసంగములో, 19:36 నిమిషాల వద్ద, ట్రంప్ ఇలా పేర్కొన్నారు, “వీళ్ళు అద్భుతమైనవారు. మనము రాబర్ట్ ఎఫ్ కెన్నెడి జూ. వంటి కొన్ని పేర్లు చేర్చవచ్చు. ఆయన ఇక్కడికి వచ్చారు మరియు అమెరికాను తిరిగి ఆరోగ్యకరంగా చేయుటకు సహాయపడనున్నారు. ఇప్పుడు ఆయన ఒక గొప్ప వ్యక్తి; ఆయన కొన్ని చర్యలు చేపట్టాలని అనుకుంటున్నారు మరియు మేము ఆయనకు సహాయపడతాము. కాని, బాబి, నాకు చమురు వదిలారు. మన వద్ద ద్రవరూప బంగారము, చమురు మరియు గ్యాస్ ఎక్కువగా ఉన్నాయి, ప్రపంచములో వేరే దేశాల కంటే మన వద్ద ఎక్కువ ద్రవరూప బంగారం ఉంది – సౌది అరేబియా కంటే ఎక్కువగా. మన వద్ద రష్యా కంటే ఎక్కువగా ఉంది. బాబి, ద్రవరూప బంగారానికి దూరంగా ఉండండి. అలా కాకుండా, బాబీ, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి.” ఈ సమయములో జనసమూహము ‘బాబి బాబి’ అని పలకడం మొదలుపెట్టారు.
మేము న్యుస్ వీక్ పై పూర్తి స్పీచ్ ట్రాన్స్క్రిప్ట్ ను కూడా సమీక్షించాము. ఇందులో రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూ. పేరు పేర్కొనబడినప్పుడు, జన సమూహము ‘బాబి బాబి’ అని అరవడం మొదలుపెట్టారు.
మేము దైనిక్ జాగరణ్ లో అంతర్జాతీయ వ్యవహారాలు కవర్ చేసే సీనియర్ విలేఖరి జేపి రంజన్ గారిని కూడా కలిశాము. ఆ నినాదాలు ‘బాబి’ అని పిలువబడే రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూ. కోసం చేయబడ్డాయని ఆయన ధృవీకరించారు.
రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూ. ఎవరు?
రాబర్ట్ ఎఫ్ కెన్నెడి ప్రముఖ కెన్నెడి కుటుంబము నుండి వచ్చిన ఒక అమెరికా రాజకీయవేత్త మరియు పర్యావరణవేత్త. ఆయన 1968లో అధ్యక్ష అభ్యర్ధి అయిన రాబర్డ్ ఎఫ్ కెన్నెడీ కుమారుడు మరియు యునైటెడ్ స్టేట్స్ 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ యొక్క మేనల్లుడు. తొలుత, కెన్నెడీ జూ 2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేయాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించారు, కాని తరువాత తిరిగి డొనాల్డ్ ట్రంప్ అనేది ఎంచుకున్నారు.
తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ వీడియోను షేర్ చేసిన ‘ది లెజెండ్ లామా’ అనే యూజర్ కు 13000 ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: ఈ క్లెయిమ్ నకిలీది అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు వెల్లడించింది. రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ పేరు పలికినప్పుడు జన సమూహము ‘మోడి మోడి’ అని పలకలేదు కాని ‘బాబి బాబి’ అని పలికారు.
- Claim Review : డొనాల్డ్ ట్రంప్ యొక్క విజయ ప్రసంగములో జన సమూహము ప్రధాని మోడి పేరు పలికారు
- Claimed By : ఫేస్బుక్ యూజర్ ‘ది లెజెండ్ లామా’
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.