Fact Check: ప్రధాని మోడి 2023 ఆస్ట్రేలియా పర్యటన ఆయన ఇటీవల చేసిన ఇటలీ పర్యటనగా తప్పుగా చూపించబడింది; వీడియో వైరల్ అవుతోంది
ఈ వీడియో ప్రధానమంత్రి నరేంద్ర మోడి మే 2023లో ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పటిది అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. మూడు-రోజుల ఆయన పర్యటనలో, ఆయన కుడోస్ బ్యాంక్ అరీనా వద్ద భారత ప్రవాసులను కలిశారు.
- By: Pallavi Mishra
- Published: Jul 8, 2024 at 12:01 PM
- Updated: Jul 19, 2024 at 05:01 PM
కొత్త ఢిల్లీ, విశ్వాస్ న్యూస్ – జూన్ 2024లో, ప్రధాన మంత్రి మోడి ఇటలీలోని వార్షిక G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు అయ్యారు. ఈ సందర్శన సందర్భంగా, ప్రధానమంత్రి మోడి స్వాగత సత్కారాలు అందుకోవడాన్ని చూపించే ఒక వీడియో సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆయన ఇటీవలి ఇటలీ పర్యటనకు సంబంధించినది అని ఈ పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది.
ఈ వీడియో ప్రధానమంత్రి నరేంద్ర మోడి మే 2023లో ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పటిది అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. మూడు-రోజుల ఆయన పర్యటనలో, ఆయన కుడోస్ బ్యాంక్ అరీనా వద్ద భారత ప్రవాసులను కలిశారు.
ఏది వైరల్ అవుతోంది?
ఫేస్బుక్ యూజర్ ‘లలిత్రాజ్వరల్డ్’ (ఆర్కైవ్ ) ఈ వీడియోను తన ప్రొఫైల్ పై జూన్ 18, 2024 నాడు షేర్ చేశారు. ఈ పోస్ట్ వెంబడి “ఇటలీ G7 లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారికి గొప్ప స్వాగతం” అనే శీర్షిక వ్రాయబడింది.
దర్యాప్తు
వైరల్ వీడియో యొక్క అసలైన మూలాన్ని కనుగొనుటకు మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించాము మరియు ఈ విజువల్స్, “ఉల్లాసవంతమైన స్వాగతముతో ప్రధాని మోడి సిడ్నీ లోని కుడోస్ అరీనాకు చేరుకున్నారు” అనే శీర్షికతో ఇండియా టుడే వారి యూట్యూబ్ ఛానల్ పై మే 23, 2023 నాడు అప్లోడ్ చేయబడిన ఒక వీడియో లో కనిపిచాయి.
న్యూస్ ఏజెన్సీ ANI యొక్క యూట్యూబ్ ఛానల్ పై మే 23, 2023 నాడు అప్లోడ్ చేయబడిన ఈ విజువల్స్ మాకు లభించాయి. అందించబడిన సమాచారము ప్రకారం, ఈ క్లిప్పింగ్ ప్రధాని మోడిగారు ఆస్ట్రేలియా పర్యటన నుండి తీసుకోబడింది. దైనిక్ జాగరణ్ కొరకు అంతర్జాతీయ వార్తలను కవర్ చేసే విలేఖరి జేపి రంజన్, ఈ విజువల్స్ ప్రధాని మోడి 2023లో ఆస్ట్రేలియా పర్యటనకు చెందినవి అని ధృవీకరించారు.
ఈ వైరల్ పోస్ట్ ఇన్స్టాగ్రాం యూజర్, లలిత్రాజ్వరల్డ్ అనే ఒక యూజర్ షేర్ చేశారు మరియు ఈయనకు 22 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ ఈ వీడియో ప్రధానమంత్రి నరేంద్ర మోడిగారి మే 2023 ఆస్ట్రేలియా పర్యటనకు చెందినదని, కుడోస్ బ్యాంక్ అరీనాకు తన మూడు-రోజుల పర్యటనలో ఆయన భారతదేశ ప్రవాసులను కలిశారు అని కనుగొనింది.
- Claim Review : ఇటలీ G7 వద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి గొప్ప స్వాగతం అందుకున్నారు
- Claimed By : ఫేస్బుక్ యూజర్
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.