Fact Check: బ్రెజిల్ లో బాలుడి అరెస్ట్ కు సంబంధించిన పాత వీడియో తప్పు క్లెయిమ్ తో వైరల్ అవుతోంది
- By: Jyoti Kumari
- Published: Jul 25, 2023 at 10:52 AM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో పోలీసులు వెంబడిస్తున్న ఒక వ్యక్తిని చూపించబడింది. ఆ ఫుటేజ్ లో, పోలీసు వాహనం ఒక మోటారుసైకిల్ వాహనదారుడిని ఆపే ప్రయత్నం చేశారు. తదుపరి, ఒక పోలీసు వ్యక్తి కారు నుండి బయటికి వచ్చి ఆ బైక్ రైడర్ ను లాగి కింద పడేశాడు. కొంతమంది ఆ వీడియో యూజర్లు శ్రీనిగర్ లో భద్రత సిబ్బంది ద్వారా ఒక తీవ్రవాదిని నిర్బంధించడం చూపుతోందని నొక్కిచెప్తున్నారు.
దర్యాప్తు తరువాత, విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని నిర్ణయించింది. వైరల్ వీడియో నిజానికి 2021 లో బ్రెజిల్ లో సంభవించిన ఒక సంఘటన నుండి తీయబడినప్పటికీ, తీవ్రవాదులకు సంబంధించినది అనే అసత్యపు క్లెయిమ్ తో శ్రీనగర్ లో తీయబడినదిగా షేర్ చేయబడింది.
ఏది వైరల్ అవుతోంది?
ఒక ఫేస్బుక్ యూజర్ ఉత్తిష్ఠ భారత్’ జులై 15 నాడు ఒక వీడియోను (ఆర్కైవ్) షేర్ చేసింది, దీని వెంట ఒక శీర్షిక, “జై హిందు రాష్ట్ర. ఇది శ్రీనగర్ మరియు ఒక స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండో బైక్ పై వెళ్తున్న ఒక తీవ్రవాదిని, స్పందించుటకు అతనికి సమయం ఇవ్వకుండా, నిర్బంధించారు. ఆర్టికల్ 370 మరియు 35A యొక్క రద్దు తరువాత మాత్రమే ఇది సాధ్యపడింది. అయినప్పటికీ, సుప్రీం కోర్టు భారతదేశములో ఎలాంటి పాజిటివ్ సంఘటనలు జరగాలని అనుకోవడం లేదు”
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు:
వైరల్ వీడియో యొక్క ప్రమాణికతను పరీక్షించుటకు, విశ్వాస్ న్యూస్ ముందుగా ఫుటేజ్ నుండి అనేక కీఫ్రేమ్స్ ను సంగ్రహించింది మరియు కీవర్డ్స్ మరియు గూగుల్ లెన్స్ ఉపయోగించి ఒక సెర్చ్ నిర్వహించింది. ఈ ప్రక్రియలో, ఇదే వీడియో 2021లో ఇది శ్రీనగర్ కు చెందినది అనే క్లెయిమ్ తో షేర్ చేయబడింది అని కనుగొనింది.
తదుపరి దర్యాప్తులో వైరల్ వీడియో ధృవీకరించబడిన యూట్యూబ్ ఛానల్ ‘ఎల్ఎల్ఎన్ ఎన్వైసి’ పై అప్లోడ్ చేయబడింది అని తేలింది. ఆగస్ట్ 5, 2021 నాడు అప్లోడ్ చేయబడిన ఈ వీడియో వెంబడి ఉన్న సమాచారము ప్రకారము, ఈ సంఘటన వాస్తవంగా బ్రెజిల్ లో జరిగింది.
అదనంగా, సెర్చ్ నిర్వహించే సమయములో, విశ్వాస్ న్యూస్ వైరల్ వీడియోకు సంబంధించిన ఒక వార్తా నివేదికను బ్రెజీలియన్ వార్తాపత్రిక ‘istoe.com’ యొక్క website పై కనుగొనింది. ఆగస్ట్ 2, 2021 నాడు ప్రచురించబడిన ఈ నివేదిక, ఈ సంఘటన ఆగస్ట్ 1, 2021 నాడు పెరోల, బ్రెజిల్ లో జరింది అని పేర్కొనింది. పోలీసు ఒక 17-సంవత్సరాల బాలుడు అనుమానాస్పదంగా ప్రవర్తించడం గమనించి, అతనిని ఆగమన్నారు, కాని అతను పారిపోయాడు. ఈ సంఘటనను పక్కన ఉండేవాళ్ళు ఈ సంఘటనను వీడియో తీశారు. వీడియోలో పోలీసుల చర్యలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి.
అంతేకాకుండా, వైరల్ వీడియోకు సంబంధించిన ఒక నివేదిక ‘ఆర్ఐసిటివి’ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై లభించింది. ఆగస్ట్ 3, 2021 నాడు అప్లోడ్ చేయబడిన ఒక వీడియోలో, ఈ సంఘటన బ్రెజిల్ లో జరిగింది అని పేర్కొనబడింది. అనేక బ్రెజీలియన్ వార్తా వెబ్సైట్లు కూడా వీడియోకు సంబంధించిన ఈ కథనాన్ని కవర్ చేశాయి.
వైరల్ వీడియో గురించి విచారించుటకు విశ్వాస్ న్యూస్ కాశ్మీర్ కు చెందిన ఒక స్థానిక విలేఖరి జునైద్ పీర్ ను కలిశారు. ఆయన కూడా ఈ వీడియో శ్రీనగర్ కు సంబంధించినది కాదు అని ధృవీకరించారు.
ముగింపు: విషయాన్ని కూలంకషంగా దర్యాప్తు చేసిన తరువాత, విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని నిర్ణయించింది. బ్రెజిల్ లో ఒక బాలుడిని నిర్బంధించడాన్ని చూపించే ఒక వీడియో, శ్రీనగర్ లో ఒక తీవ్రవాది నిర్బంధించబడ్డాడు అనే తప్పుదోవపట్టించే ధృవీకరణతో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇదివరకు సోషల్ మీడియాపై వైరల్ అయ్యింది మరియు విశ్వాస్ న్యూస్ ఇదివరకు కూడా దీని వాస్తవ తనిఖీ నిర్వహించింది.
క్లెయిమ్ సమీక్ష: శ్రీనగర్ లో ఒక తీవ్రవాది అరెస్ట్ చేయబడ్డాడు
క్లెయిమ్ చేసినది : ఉత్తిష్ఠ భారత్
వాస్తవ తనిఖీ : తప్పుదోవపట్టించేది
- Claim Review : శ్రీనగర్ లో ఒక తీవ్రవాది అరెస్ట్ చేయబడ్డాడు
- Claimed By : ఉత్తిష్ఠ భారత్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.