వాస్తవ తనిఖీ: జైపూర్ లో భారీ జన సమూహము హనుమాన్ చాలీసా పఠించారని క్లెయిమ్ చేస్తూ వైరల్ అయిన వీడియో నకిలీది; ఈ ఫుటేజ్ పాకిస్తాన్ కు చెందినది.
- By: Jyoti Kumari
- Published: Feb 27, 2023 at 11:43 AM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): రోడ్డుపై భారీ జన సమూహము హనుమాన్ చాలీసా పఠించడాన్ని చూపించే ఒక వీడియో సోషల్ మీడియాపై వైరల్ అయ్యింది. ఈ సంఘటన ముస్లింలు నమాజ్ చేయడానికి స్పందనగా జైపూర్ లో జరిగింది అనే క్లెయిమ్ తో ఈ వీడియో షేర్ చేయబడింది.
విశ్వాస్ న్యూస్ ఈ వీడియో యొక్క సమగ్ర వాస్తవ-తనిఖీ నిర్వహించింది మరియు వైరల్ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. ఈ వీడియో పాకిస్తాన్ లోని లాహోర్ లో తీయబడింది మరియు తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ (టిఎల్పి) చీఫ్ ఖదీం హుస్సెయిన్ రిజ్వి కొరకు, జనవరి 3, 2021 ఆయన మరణము తరువాత పాటించిన ‘చెహ్లం’ కు సంబంధించినది. ఇప్పుడు ఇది జైపూర్ నుండి అనే ఒక అసత్యపు క్లెయిమ్ తో వైరల్ గా షేర్ చేయబడుతోంది.
క్లెయిమ్:
ఫేస్బుక్ యూజర్ ‘దుర్గేష్ చౌహాన్’ ఈ వీడియోను ఫిబ్రవరి 17 నాడు పోస్ట్ చేసి ఇలా వ్రాశారు, “జైపూర్ లోని నమాజ్ కు స్పందనగా, రాముని భక్తులు రోడ్డు మధ్యలో ఊహించని సంఖ్యలో సమావేశమై హనుమాన్ చాలీసా పఠించారు, తద్వారా దేశము యొక్క హిందూత్వాన్ని గర్వపడేలా చేశారు. దీనికి ధన్యవాదాలు…జైశ్రీరాం.”
ఈ పోస్ట్ వాస్తవము అనుకొని, ఇతర యూజర్లు కూడా దీనిని వైరల్ చేస్తున్నారు. దీని ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు:
ఈ వీడియో అనేక సందర్భాలలో వేరువేరు క్లెయిమ్స్ తో అనేకమార్లు సోషల్ మీడియాలో ఇదివరకే వైరల్ అయ్యింది. ఇటువంటి ఒక క్లెయిమ్ ను విశ్వాస్ న్యూస్ తనిఖీ చేసింది. ఆ సమయములో మా దర్యాప్తులో ఈ వీడియో, లాహోర్, పాకిస్తాన్ కు చెందినది అని మరియు ఇది జనవరి 3, 2021 నాడు టిఎల్పి చీఫ్ ఖదీం హుస్సెయిన్ రిజ్వి యొక్క మరణము తరువాత నిర్వహించబడిన చెహ్లం అని నిరూపించబడింది
ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ ‘లబ్బైక్ న్యూస్’ పై జనవరి 4, 2021 నాడు అప్లోడ్ చేయబడింది. వీడియోలో ప్రదేశము లాహోర్ అని పేర్కొనబడింది.
ఆ సమయములో, మేము పాకిస్తానీ వార్తా ఛానల్ న్యూస్ 24 హెచ్డి విలేఖరి మొహమ్మద్ కమ్రాన్ ను ఈ విషయమై సంప్రదించాము. ఆయన ఇలా ధృవీకరించారు, “ఈ వీడియో 2021కు చెందినది మరియు పాకిస్తాన్ కు సంబంధించినది.” మీరు మా ఇదివరకటి వాస్తవ తనిఖీ కథనాన్ని ఇక్కడ చదవవచ్చు.
వైరల్ వీడియో మరియు ఇటువంటి వీడియోలు అనేక ఇతర యూట్యూబ్ ఛానల్స్ పై చూడవచ్చు.
వైరల్ క్లెయిమ్ పరిశీలన కొరకు మేము దైనిక్ జాగరణ్, జైపూర్ యొక్క సీనియర్ కరెస్పాండెంట్, శ్రీ నరేంద్ర శర్మ గారిని సంప్రదించాము. వైరల్ వీడియో యొక్క లింక్ ను మేము వారికి షేర్ చేశాము. ఈ వీడియో జైపూర్ కు సంబంధించినది కాదు అని వారు పరిశీలించారు.
మా దర్యాప్తు చివరిలో, మేము తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వీడియోను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ ‘దుర్గేష్ చౌహాన్’ ప్రొఫైన్ ను స్కాన్ చేశాము.
యూజర్ యొక్క ఫేస్బుక్ పేజ్ ను స్కాన్ చేసినప్పుడు, ఈ యూజర్ ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశి నివాసి అని కనుగొనబడింది. ఈ యూజర్ కు ఫేస్బుక్ పై 3,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: జైపూర్ లో జరిగిన హనుమాన్ చాలీసా పఠనానికి సంబంధించినది అనే క్లెయిమ్ తో వైరల్ అయిన వీడియో పాకిస్తాన్ కు చెందినది. ఈ వైరల్ వీడియో జనవరి 2021 నాడు, లాహోర్ లో ఖదీం హుస్సెయిన్ రిజ్వి యొక్క చెహ్లం సందర్భములో జనము సమావేశము అయినప్పుడు తీయబడింది. వైరల్ వీడియోలో హనుమాన్ చాలీసా యొక్క ఆడియో విడిగా చేర్చబడింది.
- Claim Review : జైపూర్ లో భారీ జనసమూహము హనుమాన్ చాలీసా పఠించింది
- Claimed By : ఎఫ్బి యూజర్: దుర్గేష్ చౌహాన్
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.