వాస్తవ తనిఖీ: బెంగాల్ లో ఒక తండ్రి తన కుమార్తెను వివాహం చేసుకున్నాడనే వార్త, 2007 కు చెందినది, ఇది తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేయబడింది.
- By: Abhishek Parashar
- Published: Feb 24, 2023 at 12:36 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఒక హిందీ వార్తాపత్రికలో ప్రచురించబడిన ఒక వార్త యొక్క స్క్రీన్ షాట్, పశ్చిమ బెంగాల్ లో ఒక ముస్లిం తండ్రి తన కుమార్తెను వివాహం చేసుకున్నాడని మరియు ఆమెను గర్భవతిని చేశాడనే క్లెయిమ్స్ తో సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఈ వార్త ఇటీవల జరిగిన ఒక సంఘటనకు సంబంధించినది అని వైరల్ పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది, కాని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, ఈ వార్త పశ్చిమ బెంగాల్ లోని జల్పైగురి లో 2007 లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించినది అని కనుగొనబడింది.
క్లెయిమ్:
సోషల్ మీడియా యూజర్ ‘యే సాది హిందూత్వ కా హై’ ఈ వైరల్ పోస్ట్ (ఆర్కైవ్ లింక్) ను షేర్ చేసి ఇలా వ్రాశారు, “#పశ్చిమ_బెంగాల్ జిహాది అఫ్జుద్దీన్ అలీ అతని సొంత #కుమార్తె ను వివాహం చేసుకున్నారు, కుమార్తె గర్భవతి, అల్లా ఆదేశం మేరకు నిఖా అని కుమార్తె కన్నతల్లి చెప్పింది. కోపోద్రిక్తులైన గ్రామస్థులు తండ్రిని తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా సేవ్ ది జిహాది లోకి అడుగుపెట్టింది.
వివిధ సోషల్ మీడియా వేదికలపై ఇతర యూజర్స్ కూడా ఈ వార్త యొక్క స్క్రీన్ షాట్స్ ను ఈ విధంగా ఉన్న మరియు ఇటువంటి క్లెయిమ్స్ తో షేర్ చేశారు.
దర్యాప్తు:
వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు నిర్వహించే సమయములో, విశ్వాస్ న్యూస్ బృందానికి వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ) ద్వారా ఒక వార్తా రిపోర్ట్ లభించింది. నవంబరు 20, 2007లో ప్రచురించబడిన ఈ రిపోర్ట్ లో ఈ సంఘటన పేర్కొనబడింది.
“యుక్త వయసులో ఉన్న తన కుమార్తెను తండ్రి వివాహం చేసుకున్న సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రములోని జల్పైగురి జిల్లాకు చెందిన కషియాఝోరా గ్రామములో వెలుగు చూసింది. ఆయన కుమార్తె ప్రస్తుతం గర్భవతి. తనకు భగవంతుడి నుండి ఇలా చేయమని ఆదేశము అందింది అని ఆ తండ్రి చెప్తున్నారు. ఈ సంఘటన ఆ బాలిక అయిదు నెలల గర్భముతో ఉండడం గ్రామస్థులు చూసినప్పుడు నిన్న వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రకారము, అప్పటి వరకు గ్రామస్థులకు ఆ బాలిక వివాహం గురించి తెలియదు. ఈ సంఘటనపై ఆగ్రహించిన ఇరుగుపొరుగువారు ఆ బాలిక తండ్రి అఫిజుద్దీన్ ఆలి (37) వద్దకు వెళ్ళారు. తన పెద్ద కూతురిని ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నానని ఆలీ చెప్పారు.” అని Webdunia.com పై పిటిఐ రిపోర్ట్ పేర్కొనింది. “ఆలీ ప్రకారము, దీనికి సంబంధించి కలలో భగవంతుకు తనకు సూచనలు ఇచ్చాడు. ఆలీ రోజు కూలీగా పనిచేస్తాడు మరియు అతనికి అయిదుమంది సంతానం ఉన్నారు” అని రిపోర్ట్ లో తెలియజేయబడింది.
ఈ సందర్భాన్ని మరింత శోధిస్తున్నప్పుడు, మాకు టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పై నవంబరు 20, 2007 నాడు ప్రచురించబడిన మరొక రిపోర్ట్ లభించింది, ఇందులో ఈ సంఘటన గురించి పేర్కొనబడింది మరియు ఈ రిపోర్ట్ లో ఉపయోగించబడిన చిత్రము వైరల్ పోస్ట్ లో ఉన్న స్క్రీన్ షాట్ మాదిరిగానే ఉంది.
“ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత గ్రామములోని ఉద్రిక్త పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, బన్నెర్హాట్ పోలీస్ స్టేషన్ అధికారులు ఆలీని, అతని భార్యను మరియు 15-సంవత్సరాల కుమర్తెను అరెస్ట్ చేసి వారిని ఎస్డీఒ న్యాయస్థానానికి తీసుకెళ్ళారు. అయితే, ఇది క్రిమినల్ న్యాయస్థానపరిధి వెలుపల ఉన్న ఒక కేసు కావడముతో మాజిస్ట్రేట్ అతనిని విడుదల చేయవలసి వచ్చింది,” అని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పేర్కొనింది.
విశ్వాస్ న్యూస్ బృందము యొక్క దర్యాప్తులో వైరల్ పోస్ట్ 2007 లో (మరొక రిపోర్ట్ చూడండి) జరిగిన ఒక పాత సంఘటనకు సంబంధించినది అని, దీనిని ఇటీవల జరిగిన సంఘటనగా తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేయబడింది అని కనుగొనబడింది. అదనపు సమాచరము కొరకు, మేము దైనిక్ జాగరణ్ కు చెందిన సిలిగురి సంపాదకుడు గోపాల్ ఓఝాను సంప్రదించాము. ఆయన ఈ సంఘటన 2007లో జరిగిందని మరియు అప్పుడప్పుడు సోషల్ మీడియాపై వైరల్ అవుతోందని ధృవీకరించారు.
తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ కు ఫేస్బుక్ పై సుమారు 10,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: పశ్చిమ బెంగల్ లోని జల్పైగురికి చెందిన ఒక ముస్లిం తండ్రి తన కన్నకూతురిని వివాహం చేసుకున్న ఒక 2007 వార్తా కథనము, ఇటీవల జరిగిన సంఘటనగా తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో ప్రచారం చేయబడింది.
- Claim Review : పశ్చిమ బెంగాల్ లో ఒక ముస్లింగ్ తండ్రి తన కుమార్తెను వివాహం చేసుకొని ఆమెను గర్భవతిని చేశాడు.
- Claimed By : ఎఫ్బి పేజ్: यह सदी हिंदुत्व का है
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.