X
X

వాస్తవ తనిఖీ: తనిష్క్ వారి దీవాలి గివ్‎అవే అని క్లెయిమ్ చేసే వైరల్ పోస్ట్ ఒక స్కామ్

  • By: Devika Mehta
  • Published: Oct 31, 2022 at 10:56 PM
  • Updated: Jul 12, 2023 at 06:25 PM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): దీపావళి రాబోతున్న వేళ చాలా కంపెనీలు పండుగ బహుమతులు అందిస్తున్నాయి. కాని ఒక సోషల్ మీడియా పోస్ట్, ఒక టాటా ఉత్పత్తి మరియు ఒక ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్ దీవాలి గివ్‎అవేలను అందిస్తోందని క్లెయిమ్ చేస్తోంది. రూ. 6000 బహుమతిని పొందే అవకాశం కొరకు ఎవరైనా ఒక లింక్ పై క్లిక్ చేసి ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వాలి.

అయితే, విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్ నకిలీదని స్కామింగ్ కొరకు మాత్రమే సృష్టించబడిందని, ఆభరణాల బ్రాండ్ ద్వారా ప్రాయోజితం చేయబడలేదని కనుగొనింది.

క్లెయిమ్

ఫేస్‎బుక్ యూజర్ చునురాం సింగ్ మెసేజ్ కు లింక్ ను స్థానిక ఫుట్‎బాల్ ఫ్యాన్స్ క్లబ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు.

పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.

ఇలాంటి మరియు ఇలాంటి మాదిరి లింక్స్ వాట్సాప్ గ్రూప్స్ మరియు ట్విట్టర్ ఖాతాలలో కూడా సర్క్యులేట్ అయి కనిపించాయి. మెసేజ్ కు లింక్ ఇక్కడ ఉంది.

దర్యాప్తు

ముందుగా, తనిష్క్ యొక్క ట్విట్టర్ మరియు ఫేస్‎బుక్ ఖాతాలను పరీక్షించడము ద్వారా విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది, కాని వారి సోషల్ మీడియా పై ఇలాంటి ప్రకటన లేదా ప్రచారాత్మక మెసేజ్ ఎక్కడ కనిపించలేదు. అయితే, ‘Alekhya by Tanishq’ కలెక్షన్ పోస్ట్ మోడల్స్ యొక్క ఇటువంటి చిత్రాన్నే షేర్ చేసిన కొన్ని పోస్ట్స్ మాకు కనిపించాయి.

చాలామంది సోషల్ మీడియా యూజర్లు కూడ దీని గురించి అవగాహన పోస్టులు మరియు queries, దీనిపై తనిష్క్ ఇలా సమాధానం ఇచ్చింది – “హాయ్, దురదృష్టవశాత్తు, తనిష్క్ యొక్క గివ్‎అవేల గురించి నకిలీ కమ్యూనికేషన్ ఉండింది, వీటిల్లో ఏదీ తనిష్క్ బ్రాండ్ ద్వారా జారీ చేయబడలేదు. కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము మరియు వీలైనంత తొందరగా దీనిని పరిష్కరిస్తాము”.

తనిష్క్ యొక్క అధికారిక వెబ్సైట్ చాట్‎బాక్స్ పై నిపుణులు (రక్షిత) నుండి ఇటువంటి సమాధానమే మాకు లభించింది, వీరు లింక్ ను నకిలీది అని అంటూ మరియు దీనిపై బృందము ఇప్పటికే పనిచేస్తుంది కాబట్టి దీనిని పట్టించుకోవద్దని చెప్తూ స్పందించారు. ఆమెతో మేము జరిపిన సంభాషణ యొక్క స్క్రీన్‎షాట్ ఈ దిగువన ఇవ్వబడింది.

మరింత తనిఖీ చేయుట కొరకు: విశ్వాస్ న్యూస్ వెబ్సైట్ లింక్ ను నిశితంగా పరిశీలించింది మరియు ఇది ఈ క్రింది విధానాలలో సందేహాస్పదమైనదిగా కనుగొన్నాము:

వెబ్సైట్ యూఆర్‎ఎల్ అధికారికంగా కనిపించలేదు 🎉💎తనిష్క్ దివాలి బహుమతులు💝️🎊 (టేల్ ఎన్ టిల్ టాప్)

అసలైన వెబ్సైట్ లింక్: Tanishq – Online Gold & Diamond Jewellery Shopping Store India

తరువాత యూఆర్‎ఎల్ లో ఒక సిఎన్ డొమెయిన్ ఉంది, ఇది ఏ వెబ్సైట్ కైనా చైనా వారి అధికారిక డొమెయిన్ పేరు

లింక్ లో ఉపయోగించబడిన మోడల్స్ చిత్రాలు బ్లర్ గా ఉన్నాయి మరియు తనిష్క్ యొక్క అసలైన వెబ్సైట్ పై ఉపయోగించబడిన వాటి మాదిరిగా ఉండినాయి.

తనిష్క్ లోగో కూడా అనుకరించబడింది

ఏదైనా బ్రౌజర్ పై ప్రశ్నావళిని ఓపెన్ చేసే సమయములో, హానికరమైన మాల్వేర్ గురించి సెక్యూరిటీ సిస్టం మనలను హెచ్చరిస్తుంది

గో డాడీ వెబ్సైట్ పై“డబ్ల్యూహెచ్‎ఓ యొక్క డేటాబేస్’ ను పరీక్షించినప్పుడు, ఈ వెబ్సైట్ అరిజోనా, యూఎస్ లో రిజిస్టర్ చేయబడినట్లు మేము కనుగొన్నాము.

అంతిమ ధృవీకరణ కొరకు, మేము సైబర్ సెక్యూరిటి నిపుణులు అయిన అనుజ్ అగర్వాల్ తో మాట్లాడాము, వారు ఇలా అన్నారు, “లెక్కలేని ఆఫర్లు పంపించడము మరియు పెద్ద పెద్ద బ్రాండ్స్ పై లింక్స్ ద్వారా డిస్కౌంట్లు అందించే ఉద్దేశముతో, మాల్వేర్ డౌన్లోడ్ చేయబడుతుంది మరియు ఫోన్లు హ్యాక్ చేయబడతాయి, దీనితో ఓటిపి తో సహా డేటా అంతా హ్యాకర్లకు కనిపిస్తుంది.”

యూజర్ యొక్క సోషల్ మీడియా స్కాన్ చేసినప్పుడు, అతనికి 43 మంది ఫాలోయర్స్ ఉన్నారని మరియు ఆగస్ట్ 2022 నుండి స్థానిక ఫుట్‎బాల్ ఫ్యాన్స్ క్లబ్ సభ్యుడుతా ఉన్నారని మేము కనుగొన్నాము.

ముగింపు: సోషల్ మీడియాపై వైరల్ అయిన తనిష్క్ దీవాలి బహుమతుల ప్రకటన ఒక స్కాం. దీనికి ఆభరణాల బ్రాండ్ తనిష్క్ కు ఎలాంటి సంబంధము లేదు, ఎందుకంటే గివ్‎అవేలకు సంబంధించి చేయబడిన కమ్యూనికేషన్ పూర్తిగా నకిలీది మరియు హానికరమైనది.

  • Claim Review : తనిష్క్ దీవాలి గివ్‎అవే లను అందిస్తోంది
  • Claimed By : ఎఫ్‎బి యూజర్ చునురాం సింగ్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later