X
X

ఫ్యాక్ట్ చెక్: కరెన్సీ నోట్లతో అలంకరించిన ఆలయం తిరుపతి బాలాజీ ఆలయం కాదు

విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో ఈ వాదన తప్పుదారి పట్టించే విధంగా నిరూపించబడింది. ఈ ఫోటోలో కనిపించే ఆలయం తిరుపతిలోని బాలాజీ ఆలయం కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం.

న్యూఢిల్లీ (విశ్వాస్ టీమ్). సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ లో, భారతీయ కరెన్సీ నోట్లతో అలంకరించబడిన ఒక ఆలయాన్ని చూడవచ్చు. ఇది తిరుపతిలోని బాలాజీ ఆలయం అని, ఈ ఆలయం పువ్వులకు బదులుగా నోట్లతో అలంకరించబడిందని పోస్ట్‌లో పేర్కొన్నారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పుదోవ పట్టించే విధంగా ఉందని రుజువైంది. ఈ ఫోటోలో కనిపించే ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతికి చెందిన బాలాజీ ఆలయం కాదు, ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరులో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

‘# ఆంధ్రప్రదేశ్‌ తిరుపతిలోని బాలాజీ ఆలయంలో, పూలకు బదులుగా భారతీయ నోట్లతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పనితనం యొక్క దృశ్యం’ అని ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ పేర్కొంది. జై తిరుపతి బాలాజీ.

దర్యాప్తు

రివర్స్ ఇమేజ్ శోధనలో, 12 అక్టోబర్ 2021 న యూట్యూబ్ ఛానెల్ SV తెలుగు టీవీలో అప్‌లోడ్ చేసిన ఇలాంటి వీడియోను మేము చూశాము. ఈ వీడియోలో “కరెన్సీ నోట్లతో అలంకరించబడిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం, నెల్లూరు, AP” అని ఉంది.

ఇక్కడ నుంచి ఒక సూచన తీసుకొని, మేము ఒక కీవర్డ్ శోధన చేశాము. ఈ అంశంపై వచ్చిన అనేక వార్తలు మరియు వీడియోలను చూశాము. 13 అక్టోబర్ 2021 న Jagran.com లో ప్రచురించిన ఒక రిపోర్ట్ ప్రకారం, “ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆలయ అలంకరణ గొప్ప ఆకర్షణగా ఉంది. నెల్లూరు జిల్లాలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ఐదు కోట్ల రూపాయలకు పైగా నోట్లతో అలంకరించారు. అమ్మవారిని రూ.5.16 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణను 100 మందికి పైగా వాలంటీర్లు చేశారు, దీనికి చాలా సమయం పట్టింది.

ఆలయాన్ని అలంకరించడానికి రూ.2,000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను ఉపయోగించారు. వైరల్ వీడియోతో సరిపోయే వార్తలో ఆలయ ఫోటోని కూడా చూడవచ్చు.

telanganatoday.com లో కూడ అదే వివరణతో ఈ వార్తను చూశాము.

తిరుపతి ఆలయాన్ని ఇటీవలి కాలంలో ఎక్కడా నోట్లతో అలంకరించినట్లు మాకు ఎలాంటి వార్తలు రాలేదు.

తిరుపతి బాలాజీ ఆలయ ప్రజాసంబంధాల అధికారి ST కృష్ణన్ ను అడగగా, ‘ఈ వీడియో తిరుపతి బాలాజీ ఆలయానికి చెందినది కాదు’ అని చెప్పారు.

ఈ వైరల్ అయిన వీడియోను రాకేష్ (బిజెపి) – (శ్రీ పరశురామ్ వారసులు) అనే హ్యాండిల్ ట్విట్టర్లో షేర్ చేశారు. యూజర్ కు 5,616 మంది ఫాలోవర్లు ఉన్నారు.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో ఈ వాదన తప్పుదారి పట్టించే విధంగా నిరూపించబడింది. ఈ ఫోటోలో కనిపించే ఆలయం తిరుపతిలోని బాలాజీ ఆలయం కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం.

  • Claim Review : ఆంధ్రప్రదేశ్‌ తిరుపతిలోని బాలాజీ ఆలయంలో, పూలకు బదులుగా భారతీయ నోట్లతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పనితనం యొక్క దృశ్యం
  • Claimed By : rskhandal143
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later