వాస్తవ తనిఖీ: రోడ్డు మీద బైక్స్ జారిపడుతున్న వీడియో సంపాద, నవీ ముంబై లోనిది కాదు, అది కరాచిలోని వీడియో
జారిపడుతున్న బైకర్స్ ఉన్న వైరల్ వీడియో క్లెయిమ్ చేయబడినట్లుగా నవీ ముంబైకు, సంపాదకు చెందినది కాదు, కాని అది కరాచీ, పాకిస్తాన్ లో తీయబడినది.
- By: Ankita Deshkar
- Published: Jul 9, 2022 at 01:09 PM
- Updated: Jul 15, 2022 at 12:36 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియా వేదికలలో విస్తృతంగా షేర్ చేయబడుతున్న ఒక వీడియో విశ్వాస్ న్యూస్ చూసింది. ఆ వీడియోలో ఒక ఫ్లైఓవర్ పై నుండి జారిపడుతున్న బైక్స్ మరియు వాటి మీది నుండి పడిపోతున్న జనాలను చూడవచ్చు. ఈ సంఘటన నవీ ముంబైలోని సంపాదలో జరిగినట్లు క్లెయిమ్ చేయబడుతోంది. అయితే విశ్వాస్ న్యూస్ దర్యాప్తు జరిపి ఈ వీడియో పాకిస్తాన్ లోని కరాచికి చెందినది అని కనుగొనింది.
క్లెయిమ్:
యూట్యూబ్ సహా సోషల్ మీడియా వేదికలపై షేర్ చేయబడుతున్న ఒక వీడియోను విశ్వాస్ న్యూస్ చూసింది.
ట్విట్టర్ యూజర్, హెచ్ సుల్తాన్ @h_sultan_ ట్విట్టర్ పై ఒక వీడియో షేర్ చేశారు మరియు ఇలా వ్రాశారు:
ఈరోజు సంపాద స్టేషన్ వద్ద.
ఆ పోస్ట్ ను మరియు దాని ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.
ఇదే క్లెయిమ్ తో ఈ వీడియో యూట్యూబ్ పై కూడా అప్లోడ్ చేయబడినట్లు మేము కనుగొన్నాము.
దర్యాప్తు:
విశ్వాస్ న్యూస్ ఈ వీడియోను ఇన్విడ్ టూల్ లో అప్లోడ్ చేసింది మరియు దీని స్క్రీన్ గ్రాబ్స్ చాలా తీసుకుంది.
మేము స్క్రీన్ షాట్స్ పై గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము మరియు ఇంటర్నెట్ పై పరీక్షించాము.
విశ్వాస్ న్యూస్ కు రిపబ్లిక్ వరల్డ్ పై ఒక నివేదిక కనిపించింది.
ఈ వార్తా నివేదిక ఈ శీర్షికతో ఉంది: పాకిస్తాన్: కరాచీలో అనేకమంది మోటారుసైకిలిస్టులు భారీ వర్షములో ఒక జారుడుగా ఉన్న రోడ్డుపై పడిపోయారు; చూడండి
ఈ సంఘటన యొక్క వీడియో కూడా ఈ నివేదిక వెంట ఉంది.
అలాగే మాకు డైలీ పాకిస్తాన్ ద్వారా అందించబడిన ఒక నివేదిక కూడా కనిపించింది, దాని శీర్షిక: చూడండి: మొదటి వర్షాకాలపు వాన కరాచీ రోడ్లను ‘వెన్న’ గా మార్చడముతో చాలా బైక్స్ జారి పడ్డాయి.
చాలా పాకిస్తానీ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఈ వీడియో అప్లోడ్ చేయబడి ఉండడం కూడా విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఒక వీడియోలో పాకిస్తాన్ రిపబ్లిక్ యొక్క లోగో ఉంది.
తన దర్యాప్తులో తదుపరి దశలో విశ్వాస్ న్యూస్ డాన్ న్యూస్ కొరకు పనిచేసే సాగర్ సున్హిందెరో అనే ఒక పాకిస్తాన్ విలేఖరిని చేరుకున్నారు. ఆయన విశ్వాస్ న్యూస్ తో ఇలా అన్నారు, “వీడియోలో కనిపిస్తున్న సంఘటన పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలో తీసినది. ఆ ప్రదేశము గులిస్తాన్-ఎ-జోహార్ సమీపములోని రషీద్ మిన్హాస్ రోడ్.” ఆ ప్రదేశానికి చెందిన కొన్ని చిత్రాలను కూడా ఆయన మాకు షేర్ చేశారు.
దర్యాప్తులోని చివరి దశలో మేము వీడియోను షేర్ చేసిన సోషల్ మీడియా హ్యాండిల్ యొక్క సామాజిక నేపథ్యాన్ని తనిఖీ చేశాము. ఈ యూజర్ కు 228 ఫాలోయర్స్ ఉన్నారు మరియు 2015లో ట్విట్టర్ లో చేరారు.
निष्कर्ष: జారిపడుతున్న బైకర్స్ ఉన్న వైరల్ వీడియో క్లెయిమ్ చేయబడినట్లుగా నవీ ముంబైకు, సంపాదకు చెందినది కాదు, కాని అది కరాచీ, పాకిస్తాన్ లో తీయబడినది.
- Claim Review : సంపాద, నవీ ముంబై వద్ద బైక్స్ జారిపడ్డాయి
- Claimed By : హెచ్ సుల్తాన్
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.