X
X

వాస్తవ తనిఖీ: వాయ్, మహారాష్ట్రలోని నంది విగ్రహము వారణాసికి చెందినది అని షేర్ చేయబడింది

వారణాసిలో జ్ఞానవాపి మసీదు ముందు ఉన్న నంది విగ్రహము అని షేర్ చేయబడిన వైరల్ చిత్రము వాయ్, సతారా లోని కాశీ విశ్వేశ్వర దేవాలయములోనిది. వైరల్ క్లెయిమ్స్ తప్పుదోవపట్టించేవి.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): జ్ఞానవాపి మసీదు వివాదము నేపథ్యములో, రెండు చిత్రాల కొల్లాజ్, ఒక చిత్రములో ఒక నంది విగ్రహాన్ని చూడవచ్చు, ఇది వారణాసిలోని కాశి విశ్వనాథ దేవాలయములోనిది అని క్లెయిమ్ చేయబడుతోంది, మరియు రెండవ చిత్రములో జ్ఞానవాపి మసీదును చూడవచ్చు.

అయినప్పటికీ, విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. నంది విగ్రహము యొక్క వైరల్ చిత్రము, మహాశివుని ‘వాహనము’, మహారాష్ట్రకు చెందిన సతారాలోని వాయ్ లో ఉన్న కాశి విశ్వేశ్వర్ దేవాలయానికి చెందినది.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్, రాజా చంద్ర మే 16వ తేదీన ఈ కొల్లాజ్ ను పోస్ట్ చేసి ఈ విధంగా వ్రాశారు: వేడుక చేసుకునే సమయము!! జై బోలేనాథ్!! జై హిందు రాష్ట్ర!!

కొల్లాజ్ పై ఉన్న వచనము ఈ విధంగా ఉంది: కాశి విశ్వనాథ్ దేవాలయములో నంది ఎదురుచూపు ముగిసింది.

పోస్ట్  మరియు దాని ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు:

ముందుగా వైరల్ అయిన చిత్రాన్ని క్రాప్ చేసి కొల్లాజ్ నుండి నంది విగ్రహము యొక్క చిత్రాన్ని వేరుచేయడముతో విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తును ప్రారంభించింది.

తరువాత విశ్వాస్ న్యూస్ నంది విగ్రహము యొక్క చిత్రముపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. ఇటువంటి నంది విగ్రహము యొక్క చిత్రము మాకు అలామి స్టాక్ ఇమేజెస్ వెబ్సైట్ పై లభించింది. దీని వెంట ఉన్న శీర్షిక ఇలా ఉంది: కాశీ విశ్వేశ్వర దేవాలయము, వాయ్, సతారా, మహారాష్ట్ర లోని నంది విగ్రహము.

అలాగే మాకు నంది విగ్రహం చిత్రము tripadvisor  వెబ్సైట్ పై కూడా లభించింది కాని వేరొక కోణముతో.

అలామి స్టాక్ ఇమేజెస్ వెబ్సైట్ లో వేరొక నంది విగ్రహము యొక్క చిత్రము కూడా ఉంది, శీర్షిక ఇలా ఉంది: నంది విగ్రహము, మహాశివుని దేవాలయము, వాయ్, సతారా, మహారాష్ట్ర, ఇండియా.

ర్యాప్తు యొక్క తరువాతి దశలో విశ్వాస్ న్యూస్ కేదార్ గోఖలే వద్దకు వెళ్ళారు, ఈయన కుటుంబ సభ్యులు కాశీ విశ్వేశ్వార దేవాలయము, వాయ్, సతారాలో ట్రస్టీలుగా ఉన్నారు. మేము ఆయనకు ఈ వైరల్ చిత్రాన్ని వాట్సాప్ పై షేర్ చేశాము మరియు ఆయన ఇది వాయ్ దేవాలయ ప్రాంగణములో ఉన్న నంది విగ్రహము అని ధృవీకరించారు.

కాబట్టి ఇది జ్ఞనవాపి మసీదు ఎదురుగా ఉన్న వారణాసిలోని నంది విగ్రహము కాదని, మహారాష్ట్ర సతారా జిల్లాలోనిది అని నిర్ధారించబడింది.

దర్యాప్తులోని చివరి దశలో, విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ యొక్క సామాజిక నేపథ్యము గురించి తనిఖీ నిర్వహించింది. రాజా చంద్ర రాయచూర్ నివాసి అని ఆయనకు 1078 మంది ఫాలోయర్స్ ఉన్నారు అని మాకు తెలిసింది.

निष्कर्ष: వారణాసిలో జ్ఞానవాపి మసీదు ముందు ఉన్న నంది విగ్రహము అని షేర్ చేయబడిన వైరల్ చిత్రము వాయ్, సతారా లోని కాశీ విశ్వేశ్వర దేవాలయములోనిది. వైరల్ క్లెయిమ్స్ తప్పుదోవపట్టించేవి.

  • Claim Review : Nandi from Varanasi
  • Claimed By : Raja Chandra
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later