వాస్తవ తనిఖీ: పావురము రష్యా అధ్యక్షుడు పుతిన్ కు వందనం చేయలేదు; ఎడిట్ చేయబడిన వీడియో వైరల్ అవుతోంది
విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో, ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది అని తేలింది. అసలైన వీడియోలో, పుతిన్ పావురాల వైపు చేయి ఊపారు కాని, ఆ పావురాలు తిరిగి ఆయనకు వందనం చేయలేదు.
- By: Pallavi Mishra
- Published: May 31, 2022 at 12:43 PM
- Updated: Jun 2, 2022 at 12:47 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇందులో ఒక పావురము రష్యా అధ్యక్షుడు పుతిన్ కు వందనం చేస్తోంది. పావురాలు కూడా పుతిన్ కు వందనం చేస్తున్నాయి అని ఈ పోస్ట్ వెంబడి ఉన్న క్లెయిమ్ లో వ్రాయబడి ఉంది. విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో, ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది అని తేలింది. అసలైన వీడియోలో, పుతిన్ పావురాల వైపు చేయి ఊపారు కాని, ఆ పావురాలు తిరిగి ఆయనకు వందనం చేయలేదు.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఫేస్బుక్ యూజర్ నికుల్ నికుల్ బి వి (ఆర్కైవ్) ఈ వైరల్ వీడియోను షేర్ చేశారు మరియు ఇలా వ్రాశారు, “పావురాలు పుతిన్ కు వందనం చేశాయి”
దర్యాప్తు
వైరల్ క్లెయిమ్ లోని వాస్తవాన్ని తెలుసుకొనుటకు, మేము ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ పై సెర్చ్ చేశాము. ఇదే వీడియో మాకు రష్యా ఉక్రెయిన్ సిరియా వరల్డ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై జూన్ 2, 2017 నాడు అప్లోడ్ చేయబడి కనిపించింది. ఈ వీడియోలో, పుతిన్ పావురము వైపు చేయి ఊపారు, కాని ఆ పావురము తిరిగి ఆయనకు వందనం చేయలేదు.
ఈ వీడియో జూన్ 1, 2017 నాడు అలెక్సీ అకోబ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై కూడా అప్లోడ్ చేయబడి కనిపించింది. ఇందులో కూడా పావురము పుతిన్ కు వందనం చేస్తున్నట్లు లేదు.
దీనికి సంబంధించి మేము కొంతమంది రష్యా విలేఖరులను కలిశాము. దీనిపై స్పందన అందిన వెంటనే ఈ వార్త అప్డేట్ చేయబడుతుంది.
నికుల్ నికుల్ బి వి అనే ఒక ఫేస్బుక్ యూజర్ ఈ వైరల్ పోస్ట్ ను షేర్ చేశారు. ఈ యూజర్ తన వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో, ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది అని తేలింది. అసలైన వీడియోలో, పుతిన్ పావురాల వైపు చేయి ఊపారు కాని, ఆ పావురాలు తిరిగి ఆయనకు వందనం చేయలేదు.
- Claim Review : చాలా పావురాలను చూశాను కాని ఇటువంటి పావురాన్ని చూడలేదు
- Claimed By : నికుల్ నికుల్ బి వి
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.