X
X

వాస్తవ తనిఖీ: ప్రమాణ స్వీకారం సమయములో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కాషాయ రంగు కండువా ధరించలేదు, వైరల్ అయిన క్లెయిమ్ తప్పుదోవపట్టించేది

విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ నకిలీది అని తేలింది. ఈ వైరల్ చిత్రము హిందువులు నిర్వహించిన ఒక వేడుకలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ ఉన్నది. ఇది ఇప్పుడు తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో షేర్ చేయబడుతోంది

  • By: Pragya Shukla
  • Published: May 28, 2022 at 10:51 AM
  • Updated: Jun 1, 2022 at 11:49 AM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ యొక్క చిత్రము ఒకటి సోషల్ మీడియా పై విస్తృతంగా షేర్ చేయబడుతోంది, దీని వెంట ఆయన ‘ఓం’ అని వ్రాయబడిన కాషాయ రంగు కండువా ధరించి ప్రమాణ స్వీకారం చేశారు అనే ఒక క్లెయిమ్ కూడా ఉంది. విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ నకిలీది అని తేలింది. ఈ వైరల్ చిత్రము హిందువులు నిర్వహించిన ఒక వేడుకలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ ఉన్నది. ఇది ఇప్పుడు తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో షేర్ చేయబడుతోంది.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్ ప్రశాంత్ గుప్త ఈ వైరల్ పోస్ట్ ను షేర్ చేసి ఇలా వ్రాశారు, “ఆస్ట్రేలియా యొక్క కొత్త ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ ఒక కాషాయ రంగు కండువాతో ప్రమాణ స్వీకారం చేశారు… జై శ్రీరాం.”

దర్యాప్తు:

వైరల్ చిత్రానికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకొనుటకు, మేము ఈ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా సెర్చ్ చేశాము. ఈ సమయములో వైరల్ క్లెయిమ్ కు సంబంధించి మాకు ది గార్డియన్స్ వెబ్సైట్ పై మే 14, 2022 నాడు ప్రచురించబడిన ఒక నివేదిక మాకు లభించింది. ఈ నివేదికలో ఇవ్వబడిన సమాచారము ప్రకారము, ఈ వైరల్ చిత్రము ఆస్ట్రేలియాలోని పారామాటలో హిందువులు నిర్వహించిన ఒక వేడుకలో తీయబడింది. ఆ సమయములో, ఆంథోని ఆల్బనీస్ ప్రధానమంత్రి కాదు, కాని ప్రతిపక్ష నాయకుడు. ఈ వార్తను ABC News కూడా ప్రచురించింది.

అందుకున్న సమాచారము ఆధారంగా, మేము కొన్ని కీవర్డ్స్ ద్వారా గూగుల్ పై సెర్చ్ చేశాము. అప్పుడు మాకు వైరల్ క్లెయిమ్ కు సంబంధించి హిందు కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా యొక్క అధికారిక ట్విట్టర్ పై 7 May 2022 నాడు ప్రచురించబడిన ఒక ట్వీట్ అభించింది. హిందు కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా వారు కూడా ఈ వేడుకకు సంబంధించిన ఒక వీడియోను తన ఫేస్‎బుక్ పేజ్ పై మే 7, 2022 నాడు షేర్ చేసింది

ఆంథోని ఆల్బనీస్ యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతాపై మాకు వైరల్ చిత్రానికి సంబంధించి మే 6, 2022 నాటి ఒక ట్వీట్ లభించింది. వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, ఆంథోని ఆల్బనీస్ ఒక శీర్షిక వ్రాశారు, “పారామాటలో ఈరాత్రి హిందు విశ్వాసం మరియు సబ్ కాంటినెంటల్ కమ్యూనిటీల వారి నుండి ఒక మంచి స్వాగతం లభించింది.”

దర్యాప్తును కొనసాగిస్తూ, మేము ఆంథోని అల్బనీస్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమము గురించి సెర్చ్ చేయడం ప్రారంభించాము. మే 23, 2022 నాడు 9 News Australia పై అప్లోడ్ చేయబడిన ప్రమాణ స్వీకారము వీడియో మాకు లభించింది. ఈ వీడియోలో, ఆయన కాషాయ రంగు కండువా వేసుకోలేదు అని స్పష్టంగా చూడవచ్చు.

మరింత సమాచారము కొరకు మేము ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రీలాన్స్ విలేఖరిని సంప్రదించాము. ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని ఆయన మాకు చెప్పారు. ఈ ఫోటో ఆంథోని ఆల్బనీస్ ప్రధానమంత్రి కాకమునుపు తీయబడినది. ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయటానికి కొన్ని వారాల ముందు, ఆయన హిందువులు నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరు అయ్యారు. ప్రమాణస్వీకార సమయములో ఆయన కాషాయ రంగు కండువా ధరించలేదు.

దర్యాప్తు యొక్క చివరి దశలో, విశ్వాస్ న్యూస్, వైరల్ పోస్ట్ షేర్ చేసిన ప్రొఫైల్ పై నేపథ్య తనిఖీ నిర్వహించింది. ఈ యూజర్ కు 797 మంది ఫాలోయర్స్ ఉన్నారు అని మేము తెలుసుకున్నాము. ప్రశాంత్ గుప్త బీహార్ నివాసి.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ నకిలీది అని తేలింది. ఈ వైరల్ చిత్రము హిందువులు నిర్వహించిన ఒక వేడుకలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ ఉన్నది. ఇది ఇప్పుడు తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో షేర్ చేయబడుతోంది

  • Claim Review : ఆస్ట్రేలియా కొత్త ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ కాషాయ రంగు కండువా ధరించి ప్రమాణస్వీకారం చేశారు. జై శ్రీరాం……
  • Claimed By : ప్రశాంత్ గుప్త
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later