X
X

వాస్తవ తనిఖీ: నకిలీ క్లెయిమ్ తో మధ్యప్రదేశ్ నుండి ఒక పాత వీడియో వైరల్ అయ్యింది

ఈ క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ ల్తన దర్యాప్తులో కనుగొనింది. ఈ వీడియో హిజాబ్ అంశానికి సంబంధించినది కాదు. నిజానికి ఈ వీడియో మధ్యప్రదేశ్ కు చెందినది మరియు ఇందులో పోలీసులు అమ్జాద్ లాలా అనే నేరస్తుడిని అరెస్ట్ చేయడం చూడవచ్చు.

  • By: Pragya Shukla
  • Published: Apr 5, 2022 at 03:58 PM
  • Updated: Apr 17, 2022 at 09:00 PM

వాస్తవ తనిఖీ: నకిలీ క్లెయిమ్ తో మధ్యప్రదేశ్ నుండి ఒక పాత వీడియో వైరల్ అయ్యింది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). చాలా వార్తా నివేదికల ప్రకారం, హిజాబ్ వివాదముపై తీర్పు ఇచ్చిన తరువాత కర్నాటక హైకోర్ట్ న్యాయమూర్తులకు మరణ బెదిరింపులు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయబడ్డారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాపై షేర్ చేయబడుతోంది. ఈ వైరల్ వీడియోలో, ఆ వ్యక్తి ముఖము ఒక నల్లని వస్త్రముతో కప్పబడి ఉంది మరియు ఇద్దరు పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొని తీసుకెళ్తున్నారు.

ఇతను హిజాబ్ తీర్పుకు సంబంధించి న్యాయమూర్తులను చంపుతానని బెదిరించిన వ్యక్తేనని ఈ పోస్ట్ లో క్లెయిమ్ చేయబడింది. తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిమ్ అవాస్తవము అని కనుగొనింది. ఈ వీడియో హిజాబ్ అంశానికి సంబంధించినది కాదు. నిజానికి ఈ వీడియో మధ్యప్రదేశ్ కు చెందినది మరియు ఇందులో పోలీసులు అమ్జాద్ లాలా అనే నేరస్తుడిని అరెస్ట్ చేయడం చూడవచ్చు.

ఏది వైరల్ అవుతోంది?

ఫేస్‎బుక్ యూజర్  సౌరభ్ ఝా ఈ వీడియోను పోస్ట్ చేశారు  మరియు ఇలా వ్రాశారు,”హైకోర్ట్ న్యాయమూర్తిని హిజాబ్ తీర్పుకు సంబంధించి మరణ బెదిరింపు చేసిన ఈ వ్యక్తి తమిళనాడుకు చెందినవాడు. ఇతను ప్రస్తుతం కర్నాటక పోలీసుల అదుపులో ఉన్నాడు!”

దర్యాప్తు-

విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిమ్ ను పరీక్షించుటకు InVid సాధనాన్ని ఉపయోగించింది. ఈ సాధనం సహాయముతో, మేము ఈ వీడియోకు సంబంధించి అనేక అంశాలను సంగ్రహించాము మరియు గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా సెర్చ్ చేశాము. ఖబర్‎వాలా న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన ఒక వీడియో మాకు లభించింది. ఈ వీడియో 15 మార్చ్ 2022 నాడు అప్లోడ్ చేయబడింది. ఈ రిపోర్ట్ ప్రకారము, ఈ వైరల్ వీడియో మధ్యప్రదేశ్ కు చెందినది మరియు అమ్జాద్ లాలా అనే నేరస్తుడిని అరెస్ట్ చేసినప్పటిది.

అందుకున్న సమాచారము ఆధారంగా, మేము కొన్ని కీవర్డ్స్ సహాయముతో గూగుల్ పై సెర్చ్ చేశాము. వైరల్ క్లెయిమ్ కు సంబంధించి నయీ దునియా వెబ్సైట్ పై మార్చ్15, 2022 నాడు ప్రచురించబడిన ఒక వార్తా నివేదిక మాకు లభించింది. ఈ నివేదిక ప్రకారం, నేరస్తుడైన అమ్జాద్ లాలా విమానాశ్రయం సమీపములో అరెస్ట్ చేయబడ్డాడు. అమ్జాద్ ఆరు సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడు మరియు నవంబరు 2020లో అతను బళ్ళారిలో సీతామావు పోలీస్ స్టేషన్ కు చెందిన టిఐ అమిత్ సోనిపై కాల్పులు జరిపాడు. దీని తరువాత, మధ్యప్రదేశ్ పోలీసులు అతనిపై రూ. 50,000 బహుమతిని ప్రకటించారు.

మరిన్ని వివరాల కొరకు, మేము Nai dunia.com, ఇండోర్ యొక్క డెప్యూటి న్యూస్ ఎడిటర్ అయిన అరవింద్ దూబె గారిని సంప్రదించాము. ఆయన మాతో ఇలా అన్నారు, “ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము. ఈ వీడియో అమ్జాద్ లాలా అరెస్ట్ ను చూపుతోంది. దీనికి మరియు కర్నాటకలోని హిజాబ్ వివాదానికి ఎలాంటి సంబంధం లేదు.”

తరువాత, మేము ఈ వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్ ను స్కాన్ చేశాము. ఈ యూజర్ కు ఫేస్‎బుక్ పై వెయ్యిమందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈ యూజర్ ఫిబ్రవరి 2010 నుండి ఫేస్‎బుక్ పై యాక్టివ్ గా ఉన్నారు.

निष्कर्ष: ఈ క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ ల్తన దర్యాప్తులో కనుగొనింది. ఈ వీడియో హిజాబ్ అంశానికి సంబంధించినది కాదు. నిజానికి ఈ వీడియో మధ్యప్రదేశ్ కు చెందినది మరియు ఇందులో పోలీసులు అమ్జాద్ లాలా అనే నేరస్తుడిని అరెస్ట్ చేయడం చూడవచ్చు.

  • Claim Review : హైకోర్ట్ న్యాయమూర్తిని హిజాబ్ తీర్పుకు సంబంధించి మరణ బెదిరింపు చేసిన ఈ వ్యక్తి తమిళనాడుకు చెందినవాడు. ఇతను ప్రస్తుతం కర్నాటక పోలీసుల అదుపులో ఉన్నాడు!
  • Claimed By : సౌరభ్ ఝా
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later