వాస్తవ తనిఖీ: ఇరాక్ నుండి ఒక పాత వీడియో రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించిన నకిలీ క్లెయిమ్ తో వైరల్ అవుతోంది
విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో, ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనబడింది. వైరల్ అయిన వీడియో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినది కాదు. ఈ వీడియో 2004 ఇరాక్ కు సంబంధించినది.
- By: Pallavi Mishra
- Published: Mar 31, 2022 at 04:22 PM
- Updated: Mar 31, 2022 at 05:35 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). రష్యా-ఉక్రెయిన్ యుద్ధము నేపథ్యములో, ఒక వీడియో సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో భారీ కాల్పుల మధ్య కొంతమంది సైనికులు ఒక భవనములోకి ప్రవేశిస్తూ కనిపిస్తారు. ఈ వీడియో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినది అని క్లెయిమ్ చేయబడుతోంది. విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో ఈ క్లెయిమ్ అసత్యము అని తేలింది. వైరల్ వీడియో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినది కాదు. ఈ వీడియో 2004 ఇరాక్ కు సంబంధించినది.
ఏది వైరల్ అవుతోంది?
ఫేస్బుక్ యూజర్ ‘ముర్తాజా నక్వీ‘ ఈ వైరల్ వీడియోను షేర్ చేశారు (ఆర్కైవ్ లింక్) మరియు ఇలా వ్రాశారు “#షేర్# రష్యా సైన్యము మరియు ఉక్రెయిన్ సైన్యము తాజాగా యుద్ధం చేస్తున్నారు…..”
దర్యాప్తు
ఈ క్లెయిమ్ ను దర్యాప్తు చేయుటకు, మేము ముందుతా ఈ వీడియోను చివరిదాకా చూశాము. చివరిలో, ఇలా వ్రాసి ఉంది: ‘టాస్క్ ఫోర్స్ వైపర్ & ది 36వ కమాండో Bn 4 శత్రువులను చంపింది, 25 శతువులను ఆక్రమించింది మరియు ష్రైన్ ను చెక్కుచెదరకుండా సురక్షితం చేసింది” మేము కీవర్డ్స్ సహాయముతో సెర్చ్ చేశాము మరియు వైపర్ టాస్క్ ఫోర్స్ అనేది యూఎస్ సేనల యొక్క యూనిట్ అని మరియు 36వ కమాండో బెటాలియన్ ఇరాక్ సేనలలో భాగమని కనుగొన్నాము.
తరువాత మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ పై కీవర్డ్స్ తో కలిపి ఈ వీడియో యొక్క కీఫ్రేమ్స్ ను సెర్చ్ చేశాము. వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్ “FUNKER530 – Veteran Community & Combat Footage” పై ఆగస్ట్ 26, 2020 నాటి ఈ వీడియో యొక్క మరింత పెద్ద వర్షన్ మాకు లభించింది. ఈ వీడియో వెంట ఉన్న వివరణ ఇలా ఉంది ‘చారిత్రాత్మక యూఎస్ ప్రత్యేక సేనలు గోల్డెన్ మాస్క్ పై దాడి చేశాయి”
అలాగే Combat Footage అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై మార్చ్ 25, 2021 నాడు అప్లోడ్ చేయబడిన ఈ వీడియో యొక్క పెద్ద వర్షన్ కూడా మాకు లభించింది. ఈ వీడియో వివరణ ఈ విధంగా ఉంది, “యూఎస్ మరియు ఇరాక్ ప్రత్యేక సేనలు గోల్డెన్ మాస్క్ పై దాడి చేశాయి।అక్టోబరు 1, 2004। సమర్రా, ఇరాక్” ఈ వీడియో వెంట ఉన్న సమగ్ర వివరణ ఇలా ఉంది “సమర్రా కొరకు జరిగిన యుద్ధము సమయములో, ఆపరేషన్ బాటన్ రోగ్ అని కూడా పిలువబడుతుంది. యూఎస్ ప్రత్యేక సేనలు మరియు 36వ ఇరాక్ కమాండో బెటాలియన్ ఈ దాడిలో ఉన్నాయి. దాడిలో 25 ఇరాకి తిరుగుబాటుదారులు కూడా పట్టుబడ్డారు మరియు 4 చంపబడ్డారు.”
ఇక్కడి నుండి ఈ సంఘటన 2004 నాటిది కావచ్చు అని మాకు ఒక క్లూ లభించింది. కీవర్డ్స్ సహాయముతో సెర్చ్ చేయడము వలన, ఈ ఆపరేషన్ గురించిన వివరాలు మాకు The Guardian యొక్క యుద్ధ లాగ్స్ లో లభించింది. ఈ వివరాల ప్రకారం ఈ గోల్డెన్ మాస్క్ ఆపరేషన్ 2004లో జరిగింది.
అలాగే మాకు latimes.com వద్ద దీనికి సంబంధించి 2004 నాటి ఒక నివేదిక లభించింది. ఈ క్రింది కొల్లాజ్ లో వైరల్ చిత్రములో కనిపించే భవనము మరియు ఇరాక్ యొక్క గోల్డెన్ మాస్క్ ల మధ్య పోలికలను మీరు చూడవచ్చు.
దీనికి సంబంధించి ధృవీకరణ కొరకు విశ్వాస్ న్యూస్ ఈమెయిల్ ద్వారా ఉక్రెయిన్ యొక్క వాస్తవ-తనిఖీ బృందాన్ని సంప్రదించింది. అక్కడి నుండి సమాధానము అందుకున్న వెంటనే వార్త అప్డేట్ చేయబడుతుంది.
ఈ వైరల్ పోస్ట్ ను ‘ముర్తాజా నక్వి’ అనే ఒక ఫేస్బుక్ యూజర్ షేర్ చేశారు. ఈ యూజర్ కు 7,728 ఫాలోయర్స్ ఉన్నారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో, ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనబడింది. వైరల్ అయిన వీడియో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినది కాదు. ఈ వీడియో 2004 ఇరాక్ కు సంబంధించినది.
- Claim Review : రష్యా సేనలు మరియు ఉక్రెయిన్ సైన్యము తాజాగా యుద్ధం చేస్తున్నాయి…
- Claimed By : ముర్తాజా నక్వి
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.