వాస్తవ తనిఖీ: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ కు సంబంధించినదిగా వైరల్ అవుతున్న ఈ ఫోటో, ఎడిట్ చేయబడినది.
విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు వైరల్ అవుతున్న ఈ చిత్రము నకిలీది అని కనుగొనింది. ఒక విదేశీయుడి చేతిలో కనిపించే ప్లకార్డు ఎడిట్ చేయబడినది.
- By: Pallavi Mishra
- Published: Mar 25, 2022 at 06:06 PM
- Updated: Apr 1, 2022 at 09:41 AM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఒక విదేశీయుడు తన చేతులలో ఒక ప్లకార్డ్ పట్టుకొని ఉన్నటు కనిపించే ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లకార్డ్ పై వచనము ఈ విధంగా ఉంది: ‘కాశ్మీర్ ఫైల్స్’ ఒక చలనచిత్రం కాదు. ఇది హిందువులకు ఒక మేలుకొలుపు పిలుపు.’ ఈ ఫోటో నిజము అని అనుకుంటూ, సోషల్ మీడియా యూజర్స్ చాలామంది దీనిని షేర్ చేశారు. విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు వైరల్ అయిన చిత్రము నకిలీది అని కనుగొనింది. ఒక విదేశీయుడి చేతిలో కనిపించే ప్లకార్డు ఎడిట్ చేయబడింది. దీని అసలైన ఫోటో 2019లో తీసినది మరియు ప్లకార్డ్ పై వచనము “మీ డేటింగ్ ప్రొఫైల్ కొరకు గ్రూప్ చిత్రాలను ఉపయోగించడం ఆపేయండి” అని వ్రాసి ఉంది.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఫేస్బుక్ యూజర్ ‘ఆశిష్ రాయల్’ ఈ ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.
దర్యాప్తు
మా దర్యాప్తును ప్రారంభిస్తూ, మేము ముందుగా గూగుల్ రివర్స్ ఇమేజ్ ఉపయోగించి వైరల్ అయిన చిత్రము కొరకు సెర్చ్ చేశాము. మాకు ఈ చిత్రము ‘dudewithsign’ అనే ఒక వెరిఫైడ్ ఇన్స్టాగ్రాం హ్యాండిల్ పై నవంబర్ 25, 2019 నాడు అప్లోడ్ చేయబడినదిగా కనిపించింది. కాని ఈ చిత్రములో, ఆ వ్యక్తి యొక్క టి-షర్ట్ రంగు ఎరుపు కాదు మరియు ప్లకార్డు పై వేరే విషయం వ్రాసి ఉంది. ఈ ఫోటోలోని ప్లకార్డ్ పై ‘మీ డేటింగ్ ప్రొఫైల్ కొరకు గ్రూప్ చిత్రాలను ఉపయోగించడం ఆపేయండి” అని వ్రాసి ఉంది.
Dudewithsign ఇన్స్టాగ్రాం హ్యాండిల్ ను దర్యాప్తు చేయగా, ఈ చిత్రములో కనిపించే వ్యక్తి మరియు ఈ ఖాతాను నిర్వహించే వ్యక్తి సేథ్ ఫిలిప్స్ అని మేము కనుగొన్నాము. మాకు సేథ్ ఫిలిప్స్ గురించి చాలా వార్తా నివేదికలు లభించాయి.
మేము dudewithsign యొక్క ఇన్స్టాగ్రాం హ్యాండిల్ ని సెర్చ్ చేశాము కాని ఎక్కడ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ఏదీ మాకు కనిపించలేదు.
అందుకని వైరల్ అవుతున్న చిత్రము ఎడిట్ చేయబడింది అని స్పష్టం అయ్యింది. కాని ధృవీకరణ కోసం, మేము మెయిల్ ద్వారా సేథ్ ఫిలిప్స్ ను సంప్రదించాము. అక్కడి నుండి సమాధానం వచ్చిన వెంటనే ఈ వార్త అప్డేట్ చేయబడుతుంది.
నకిలీ క్లెయిమ్ తో ఈ పోస్ట్ షేర్ చేసిన యూజర్ ఆశిష్ రాయల్ యొక్క సోషల్ స్కానింగ్ లో, ఈ యూజర్ రిషికేశ్ నివాసి అని మాకు తెలిసింది.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు వైరల్ అవుతున్న ఈ చిత్రము నకిలీది అని కనుగొనింది. ఒక విదేశీయుడి చేతిలో కనిపించే ప్లకార్డు ఎడిట్ చేయబడినది.
- Claim Review : కాశ్మీర్ ఫైల్స్ ఒక చలనచిత్రం కాదు. ఇది హిందువులకు ఒక మేలుకొలుపు పిలుపు.
- Claimed By : ఆశిష్ రాయల్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.