వాస్తవ తనిఖీ: అఖిలేష్ యాదవ్ యొక్క ఎడిట్ చేయబడిన వీడియో అసత్యపు క్లెయిమ్ తో వైరల్ అవుతోంది
అఖిలేష్ యాదవ్ యొక్క వైరల్ వీడియో గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, ఆ వీడియో గురించి చేసిన క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. వైరల్ అవుతున్న అఖిలేష్ యాదవ్ వీడియో ఎడిట్ చేయబడినది.
- By: Pragya Shukla
- Published: Mar 6, 2022 at 10:50 PM
- Updated: Mar 6, 2022 at 11:18 PM
విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ). అఖిలేష్ యాదవ్ కు చెందిన ఒక 19-క్షణాల వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఇందులో అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికలలో తన ఓటమిని అంగీకరించినట్లుగా క్లెయిమ్ చేయబడింది. అంతే కాకుండా యూపి ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అంటే, మార్చ్ 11 న ఆయన విదేశాలకు వెళ్తున్నట్లుగా కూడా ఈ పోస్ట్ లో క్లెయిమ్ చేయబడింది. ఈ వీడియోలో, అఖిలేష్ యాదవ్ NDTV విలేఖరికి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నట్లు ఉంది. ఈ
ఇంటర్వ్యూలో, విలేఖరి, “11న మీరు లండన్ వెళ్తున్నారా?” అని అడిగినట్లు దానికి అఖిలేష్ యాదవ్ “నేను లండన్ ఎందుకు వెళ్ళను” అని సమాధానము ఇచ్చినట్లు ఉంది.
అఖిలేష్ యాదవ్ యొక్క ఈ వైరల్ వీడియోను విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు ఈ వీడియోలో చేయబడిన క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. వైరల్ అవుతున్న అఖిలేష్ యాదవ్ యొక్క ఈ వీడియో ఎడిట్ చేయబడినది.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
వైరల్ వీడియోను షేర్ చేస్తూ, అఖిలేష్ యాదవ్ ఓటమిని అంగీకరించారు అని ఫేస్బుక్ యూజర్ కమల్ రాజపూత్ వ్రాశారు: – అఖిలేష్ దారుణంగా ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలలో తన ఓటమిని ఆయన అంగీకరించారు. ఆయన యూపి ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు, అంటే మార్చ్ 11న విదేశాలకు వెళ్తున్నారు. ఆయన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అంటే తాను విదేశాలకు వెళ్తున్నాను అని పరోక్షంగా అంగీకరించారు”.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు. మరొక ఫేస్బుక్ యూజర్ కుమార్ ప్రవీణ్ కూడా తన ఖాతాపై ఇటువంటి క్లెయిమ్ నే షేర్ చేశారు.
దర్యాప్తు
వైరల్ క్లెయిమ్ గురించిన వాస్తవం తెలుసుకొనుటకు, మేము కొన్ని కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ పై సెర్చ్ చేశాము. ఈ క్రమములో మాకు NDTV యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై జూన్ 23, 2021 నాడు అప్లోడ్ చేయబడిన అఖిలేష్ యాదవ్ యొక్క అసలైన వీడియో లభించింది.26-నిమిషాల వీడియో చూసిన తరువాత, ఇంటర్వ్యూలో ఉత్తర్ ప్రదేశ్ లోని కోవిడ్-19 పరిస్థితి మరియు రైతుల నిరసనల గురించి చర్చించబడింది. వీడియోలో 10 నిమిషాల 50 క్షణాల వద్ద, విలేఖరి “ఈ పరిస్థితులలో మీరు లండన్ వెళ్ళారు అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.” అని అనడం వినిపిస్తుంది.
దీనికి సమాధానంగా, అఖిలేష్ యాదవ్ ముందుగా, “నేను లండన్ ఎప్పుడు వెళ్ళానో మీరు తెలుసుకోవాలి”. ఆ విలేఖరి ముందుగానే సిద్ధంగా వచ్చారు అని అనుకున్నానని ఆయన అన్నారు. ఆ తరువాత తన కుమార్తెను కళాశాలలో చేర్పించటానికి తాను లండన్ వెళ్ళానని స్పష్టం చేశారు. ఈ 26-నిమిషాల వీడియోలో ఎక్కడా మీరు 11న లండన్ వెళ్తున్నారా అని విలేఖరి అడగలేదు. ఈ మాటలను వైరల్ వీడియోను ఎడిట్ చేస్తూ చేర్చబడ్డాయి.
దీనిని ధృవీకరించుటకు మేము సమాజ్వాది పార్టి జాతీయ ప్రతినిధి ఆశుతోష్ కుమార్ వర్మ గారిని సంప్రదించాము. వైరల్ క్లెయిమ్ అసత్యము అని ఆయన మాతో అన్నారు. ప్రతిపక్షాలు అఖిలేష్ యాదవ్ కు వ్యతిరేకంగా అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని, సమాజ్వాది పార్టీ పేరుప్రతిష్ఠలకు కళంకాన్ని ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
దర్యాప్తు యొక్క చివరి దశలో విశ్వాస్ న్యూస్, వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన ప్రొఫైల్ పై ఒక నేపథ్య తనిఖీ చేసింది. కమల్ రాజపూత్ అక్టోబరు 2013 నుండి ఫేస్బుక్ పై క్రియాశీలకంగా ఉన్నారు అని, ఆ యూజర్ ఉత్తర్ ప్రదేశ్ లోని ఛారా నగర నివాసి అని దర్యాప్తు ద్వారా మాకు తెలిసింది.
निष्कर्ष: అఖిలేష్ యాదవ్ యొక్క వైరల్ వీడియో గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, ఆ వీడియో గురించి చేసిన క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. వైరల్ అవుతున్న అఖిలేష్ యాదవ్ వీడియో ఎడిట్ చేయబడినది.
- Claim Review : అఖిలేష్ దారుణంగా ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలలో తన ఓటమిని ఆయన అంగీకరించారు. ఆయన యూపి ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు, అంటే మార్చ్ 11న విదేశాలకు వెళ్తున్నారు. ఆయన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అంటే తాను విదేశాలకు వెళ్తున్నాను అని పరోక్షంగా అంగీకరించారు
- Claimed By : కమల్ రాజపూత్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.