X
X

వాస్తవ తనిఖీ: ఈ వీడియో పశ్చిమ బెంగాల్ కు చెందినది, ఉత్తర్ ప్రదేశ్ కాదు.

విశ్వాస్ న్యూస్ ఈ వీడియోను తెనిఖీ చేసి ఇది ఉత్తర్ ప్రదేశ్ కు చెందినది కాదు అని కనుగొనింది. ఈ వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్, ఏప్రిల్ 2020 కు చెందినది. దీనికి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు.

  • By: Umam Noor
  • Published: Feb 20, 2022 at 09:04 PM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). సోషల్ మీడియాపై ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది ఒక మహిళా నాయకురాలిని అక్కడి నుండి వెళ్ళిపొమ్మని తరుముతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినదిగా దీనిని లింక్ చేస్తూ ఈ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోను షేర్ చేస్తూ, ఉత్తర్ ప్రదేశ్ లో ఓట్ల కొరకు వచ్చిన బిజేపి అభ్యర్ధిని ప్రజలు బెదిరించి తరిమి పంపించారు అని యూజర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. విశ్వాస్ న్యూస్ ఈ వీడియోను తనిఖీ చేసినప్పుడు ఇది ఉత్తర్ ప్రదేశ్ కు చెందినది కాదని మేము కనుగొన్నాము. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ కు చెందినది. ఏప్రిల్ 2020 లో బిజేపి అభ్యర్ధిని ప్రజలు తరిమినప్పటిది.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

ఈ వీడియోను షేర్ చేస్తూ, ఫేస̴్‎బుక్ యూజర్ ఇలా వ్రాశారు, “ఓట్లు అడగటానికి వచ్చిన బిజేపి అధికారిక అభ్యర్ధులకు ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు ఈ విధంగా స్వాగతం తెలిపారు”

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

మా దర్యాప్తును ప్రారంభించుటకు, మేము ముందుగా ఆ వీడియోను జాగ్రత్తగా చూశాము. వీడియోలో ‘జీ24 ఘంట’ ఛానల్ యొక్క లోగో కనిపించింది. ఈ యూట్యూబ్ ఛానల్ పై మేము కీవర్డ్ సెర్చ్ తో వీడియోతో సెర్చ్ చేయడం ప్రారంభించాము. సెర్చ్ చేయడము వలన, ఇది ఏప్రిల్ 10, 2021 నాడు అప్లోడ్ చేయబడినట్లు తెలిసింది. ఈ వీడియోలో ఇవ్వబడిన సమాచారము ప్రకారము ‘చుచురా లో బలమైన నిరసనల మధ్య లాకెట్ ఛటర్జీ, లాకెట్స్ కార్ చుట్టూ ఎన్నికల హింస.’

ఈ విషయానికి సంబంధించిన వార్తల వీడియో మాకు ఏబిపి న్యూస్ యొక్క యూట్యూబ్ ఛానల్ పై లభించింది. ఏప్రిల్ 10, 2021 పై అప్లోడ్ చేయబడిన వీడియో ప్రకారం, ‘బిజేపి అభ్యర్ధి లాకెట్ ఛటర్జీ యొక్క కారుపై హుగ్లీ, పశ్చిమ బెంగాల్ లో దాడి జరిగింది.’ ఈ దిగువన పూర్తి వీడియో చూడవచ్చు.

విశ్వాస్ న్యూస్ వారు ధృవీకరణ కొరకు దైనిక్ జాగరణ్ యొక్క కోల్‎కత్త విలేఖరిని సంప్రదించారు. వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ, ఆయన ఇలా అన్నారు, ‘ఈ వీడియో పోయిన సంవత్సరం బెంగాల్ ఎన్నికలకు సంబంధించినది. ఆ సమయములో బిజేపి అభ్యర్ధి లాకెట్ ఛటర్జీ చుచురాకు వెళ్ళారు, అక్కడ టిఎంసి వర్గము వారు ‘వెనక్కు వెళ్ళు’ అని నినాదాలు చేశారు మరియు అక్కడి నుండి వెళ్ళిపోవాలని కాన్వాయ్ కు చెప్పారు.

తప్పుదోవపట్టించే పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ యొక్క సోషల్ స్కానింగ్ లో మాకు ఈ యూజర్ తుంకూర్ నివాసి అని మరియు ఫేస్‎బుక్ పై ఇవ్వబడిన వివరాల ప్రకారం ఆయన ఒక రాజకీయనాయకుడు.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ ఈ వీడియోను తెనిఖీ చేసి ఇది ఉత్తర్ ప్రదేశ్ కు చెందినది కాదు అని కనుగొనింది. ఈ వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్, ఏప్రిల్ 2020 కు చెందినది. దీనికి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later