వాస్తవ తనిఖీ: కనబడకుండా పోయిన కొన్ని గంటలలోనే ఈ బాలిక తన కుటుంబాన్ని చేరుకుంది; అసత్యపు క్లెయిమ్ తో పాత వీడియో వైరల్ అయ్యింది
విశ్వాస్ బృందము జరిపిన దర్యాప్తులో ఈ క్లెయిమ్ అసత్యము అని నిరూపొంచబడింది. మంగళూరు యాచకుల కథనముతో వైరల్ అయిన ఈ వీడియో వాస్తవానికి కొత్త ఢిల్లీలోని జైత్పూర్ గురుద్వారా ప్రచారములోకి వచ్చింది. మరియు వీడియోలో కనిపించిన బాలిక కనబడకుండాపోయిన రోజునే తన కుటుంబాన్ని తిరిగి చేరుకుంది.
- By: Pallavi Mishra
- Published: Jan 30, 2022 at 10:28 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది, ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒక చిన్న బిడ్డని తన చేతులలో తీసుకెళ్ళడం కనిపిస్తుంది. ఆ బిడ్డ తన కుటుంబము నుండి విడిపోయిందని, ఆ బిడ్డ తన కుటుంబాన్ని చేరుకోవడములో సహాయం చేయండి అని వీడియో తీస్తున్న వ్యక్తి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రజలు ఈ వీడియోను ఫేస్బుక్ పై అప్లోడ్ చేస్తున్నారు మరియు ఈ బిడ్డ మంగళూరు, కర్నాటకలో కొంతమంది యాచకుల వద్ద కనిపించింది అని క్లెయిమ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. నిజానికి ఈ వీడియో ఈ సంవత్సరం ప్రారంభములో కొత్త ఢిల్లీలోని ఒక జైత్పూర్ గురుద్వారాలో తీయబడింది. మరియు వీడియోలో చూపించబడిన ఆ బాలిక అదేరోజు తన కుటుంబాన్ని చేరుకుంది.
వైరల్ పోస్ట్ లో ఏముంది
ఫేస్బుక్ యూజర్ దినేష్ రావల్ ఈ వీడియోను ఫేస్బుక్ పై షేర్ చేశారు మరియు ఈ విధంగా వ్రాశారు, “అనువదించబడింది: ఈ చిన్నారి బాలిక మంగళూరు (దక్షిణ భారతదేశము) కు చెందిన యాచకుల వర్గానికి చెందినది. ఈ వార్తను అందరికి తెలియజేయండి. ఈ బాలిక తన పేరు చెప్పగలుగుతోంది, ఆమె పేరు సోనల్ బిపిన్ పటేల్ అని చెప్తోంది. ప్రతి గ్రూప్ లో ఈ ఫోటోతో ఒక పోస్ట్ షేర్ చేయండి. మన ప్రయత్నాలతో, ఆమె తన తల్లిదండ్రులను చేరుకోగలదు”.
దర్యాప్తు
ఈ వైరల్ క్లెయిమ్ ను తనిఖీ చేయటానికి మేము ముందుగా ఈ వీడియోను జాగ్రత్తగా చూశాము. వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి, ఒకచోట ఆ బాలిక జైత్పూర్ లో కనిపించింది అని చెప్పారు. ఇంటర్నెట్ పై శోధన చేయగా, జైత్పూర్ అనేది ఢిల్లీలోని ఒక ప్రాంతము అని మాకు తెలిసింది.
ఈ వైరల్ వీడియోను మేము InVID సాధనములో అప్లోడ్ చేశాము మరియు అనేక గ్రాబ్స్ సేకరించాము మరియు ఆ తరువాత వాటిని ‘జైత్పూర్+మిస్సింగ్ గర్ల్’ అనే కీవర్డ్స్ తో గూగుల్ రివర్స్ ఇమేజ్ పై సెర్చ్ చేశాము. మాకు ఈ వీడియో ఫేస్బుక్ పోస్ట్ పై కనిపించింది. అందులో వీడియోలో ఉన్న బాలిక ఢిల్లీలోని జైత్పూర్ గ్రామము గురుద్వారాలో కనిపించింది అని చెప్పబడింది. ఈ వీడియో జనవరి 1, 2021లో అప్లోడ్ చేయబడింది. ఈ వీడియో వెంబడి వ్రాయబడిన టెక్స్ట్ ఇలా ఉంది, ‘ఈ బాలిక ఢిల్లీలోని జైత్పూర్ గ్రామములో కనిపించింది. ఆమె కుటుంబ సభ్యులు వచ్చి గురుద్వారా నుండి ఆమెను తీసుకొని వెళ్ళవచ్చు. స్నేహితులారా, ఈ వీడియోను వీలైనంతగా షేర్ చేయండి.
దీని తరువాత మేము జైత్పూర్ గురుద్వారాకు కాల్ చేశాము. మేము జ్ఞాని పూరణ్ సింగ్ జీతో మాట్లాడాము. ఈ వీడియో జైత్పూర్ గురుద్వారాకు చెందినదే అని ఆయన ధృవీకరించారు. కొంతమంది ఈ బాలికను గురుద్వారాకు తీసుకొని వచ్చినప్పుడు, గురుద్వారాలోని సేవక్ లు ఈ బాలిక వీడియోను కమ్యూనిటిలో ప్రచారం చేశారని మరియు ఆ తరువాత ఆ బాలిక తల్లి వచ్చి బాలికను తీసుకెళ్ళిందని ఆయన చెప్పారు.
ఇటీవల మంగళూరులో ఇటువంటి వార్త ఏదైనా వచ్చిందా అని తెలుసుకునేందుకు మేము కీవర్డ్స్ సహాయముతో మేము ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాము. అలాంటి వార్త ఏది మాకు కనిపించలేదు.
చివరిగా, విశ్వాస్ న్యూస్ దినేష్ రావల్ యొక్క ఫేస్బుక్ ఖాతా యొక్క సోషల్ స్కానింగ్ చేశాము. ఆ యూజర్ అహ్మదాబాద్ నివాసి.
విశ్వాస్ బృందము జరిపిన దర్యాప్తులో ఈ క్లెయిమ్ అసత్యము అని నిరూపొంచబడింది. మంగళూరు యాచకుల కథనముతో వైరల్ అయిన ఈ వీడియో వాస్తవానికి కొత్త ఢిల్లీలోని జైత్పూర్ గురుద్వారా ప్రచారములోకి వచ్చింది. మరియు వీడియోలో కనిపించిన బాలిక కనబడకుండాపోయిన రోజునే తన కుటుంబాన్ని తిరిగి చేరుకుంది.
निष्कर्ष: విశ్వాస్ బృందము జరిపిన దర్యాప్తులో ఈ క్లెయిమ్ అసత్యము అని నిరూపొంచబడింది. మంగళూరు యాచకుల కథనముతో వైరల్ అయిన ఈ వీడియో వాస్తవానికి కొత్త ఢిల్లీలోని జైత్పూర్ గురుద్వారా ప్రచారములోకి వచ్చింది. మరియు వీడియోలో కనిపించిన బాలిక కనబడకుండాపోయిన రోజునే తన కుటుంబాన్ని తిరిగి చేరుకుంది.
- Claim Review : ఈ చిన్నారి బాలిక మంగళూరు (దక్షిణ భారతదేశము) కు చెందిన యాచకుల వర్గానికి చెందినది. ఈ వార్తను అందరికి తెలియజేయండి. ఈ బాలిక తన పేరు చెప్పగలుగుతోంది, ఆమె పేరు సోనల్ బిపిన్ పటేల్ అని చెప్తోంది. ప్రతి గ్రూప్ లో ఈ ఫోటోతో ఒక పోస్ట్ షేర్ చేయండి. ఆమె వెంట ఉన్న యాచకులు ముంబై నుండి వచ్చిన ఒక రైలులో కనిపించారు. మన ప్రయత్నాలతో, ఆమె తన తల్లిదండ్రులను చేరుకోగలదు.
- Claimed By : దినేష్ రావల్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.