వాస్తవ తనిఖీ: హెడ్లీ వెరిటి చిత్రం ఎడిట్ చేయబడి స్వామి వివేకానంద క్రికెట్ ఆడుతున్న చిత్రముగా షేర్ చేయబడింది
స్వామి వివేకానంద పేరుతో ప్రచురించబడిన వైరల్ చిత్రము హెడ్లి వెరిటికి చెందినది. వైరల్ చిత్రము మార్ఫింగ్ చేయబడింది.
- By: Ankita Deshkar
- Published: Dec 31, 2021 at 05:07 PM
- Updated: Jul 12, 2023 at 06:24 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఒక వ్యక్తి ఒక స్టేడియం వద్ద బౌలింగ్ చేస్తూ క్రికెట్ ఆడుతున్న చిత్రం వివిధ సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా షేర్ చేయబడుతోంది. 1880ల మధ్యకాలములో ఎప్పుడో ఈడెన్ గార్డెన్స్ వద్ద ఒక మ్యాచ్ లో నరేంద్రనాథ్ దత్త అనే వ్యక్తి ఏడు వికెట్స్ తీసుకున్నాడు అని క్లెయిం చేయబడుతోంది. కాని అతను క్రికెట్ ఆటను కొనసాగించకుండా స్వామి వివేకానంద పేరుతో ఒక సన్యాసిగా మారాడని క్లెయిం చేయబడింది. దీని గురించి విశ్వాస్ న్యూస్ ఒక వాస్తవ తనిఖీ నిర్వహించింది మరియు ఆ చిత్రము మార్ఫింగ్ చేయబడిందని మరియు ఆ చిత్రములో ఉన్న వ్యక్తి స్వామి వివేకానంద కాదని కనుగొనింది.
క్లెయిం
ఫేస్బుక్ యూజర్ ఎంఆర్కె కుమరన్ ఈ వైరల్ చిత్రాన్ని డిసెంబరు 1వ తేదీన ఫేస్బుక్ పై పోస్ట్ చేశారు.
ఆ చిత్రముపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: అది 1880ల మధ్యకాలం. ఈడెన్ గార్డెన్స్ ప్రారంభం అయి సుమారు 20 సంవత్సరాలు అయిన సమయములో, కలకత్తా క్రికెట్ క్లబ్ (సిసిసి) మరియు ఆ గ్రౌండ్ అప్పటి ఆక్రమణదారులు మరియు టౌన్ క్లబ్ మధ్య ఒక మ్యాచ్ గోస్ట్ చేసింది. రెండవ వారి తరఫున ఆడుతున్న నరేంద్రనాథ్ దత్త అనే వ్యక్తి ఏడు వికెట్లు తీసుకున్నాడు. అతను ఆ తరువాత క్రికెట్ కొనసాగించలేదు. ఆయన స్వామి వివేకానందగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.
ఆ పోస్ట్ ను మరియు ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ ఒక సాధారణ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ తో వాస్తవ తనిఖీని ప్రారంభించింది. మాకు Getty Images యొక్క వెబ్సైట్ పై అసలైన చిత్రం లభించింది.
ఆ చిత్రము యొక్క వివరణ ఈ విధంగా ఉంది: యోర్క్షైర్ క్రికెటర్ హెడ్లీ వెరిటి (1905 – 1943) వరకు ఆడారు, దాదాపు 1940 వరకు. (హుల్టన్ ఆర్కైవ్/గెట్టి ఇమేజెస్ ద్వారా ఫోటో)
అంతేకాకుండా ఒక చిన్న కీవర్డ్ సెర్చ్ తో మేము ESPN Cric Info యొక్క వెబ్సైట్ కు చేరుకున్నాము. ఇక్కడ ఆ రోజుకు సంబంధించిన మరిన్ని చిత్రాలను, ముఖ్యంగా హెడ్లి వెరిటి యొక్క చిత్రాలను మేము చూశాము.
దర్యాప్తు యొక్క చివరి చర్యగా విశ్వాస్ న్యూస్ సచ్చిదానంద షేవ్డే గారిని సంప్రదించింది. ఆయన ఒక రచయిత మరియు స్వామి వివేకానంద గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఒక వ్యాసకర్త కూడా.
ఆయన ఇలా అన్నారు, “స్వామి వివేకానంద క్రికెట్ ఆడినట్లు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ఆయన ఆడినప్పటికీ, 1880 లో ఆయన 16 సంవత్సరాల వయసులో ఉండిఉండేవారు. ఇది స్వామి వివేకానంద చిత్రము కాదు. ఇది హెడ్లి వెరిటి యొక్క చిత్రము. ఈ వైరల్ చిత్రము ఎడిట్ చేయబడింది”.
దర్యాప్తు యొక్క చివరి దశలో, విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ చిత్రాన్ని షేర్ చేసిన ఎంఆర్కె కుమరన్ యొక్క సామాజిక నేపథ్యము గురించి తనిఖీ నిర్వహించింది. ఆయన ఆదూర్ నివాసి.
निष्कर्ष: స్వామి వివేకానంద పేరుతో ప్రచురించబడిన వైరల్ చిత్రము హెడ్లి వెరిటికి చెందినది. వైరల్ చిత్రము మార్ఫింగ్ చేయబడింది.
- Claim Review : అది 1880ల మధ్యకాలం. ఈడెన్ గార్డెన్స్ ప్రారంభం అయి సుమారు 20 సంవత్సరాలు అయిన సమయములో, కలకత్తా క్రికెట్ క్లబ్ (సిసిసి) మరియు ఆ గ్రౌండ్ అప్పటి ఆక్రమణదారులు మరియు టౌన్ క్లబ్ మధ్య ఒక మ్యాచ్ గోస్ట్ చేసింది. రెండవ వారి తరఫున ఆడుతున్న నరేంద్రనాథ్ దత్త అనే వ్యక్తి ఏడు వికెట్లు తీసుకున్నాడు. అతను ఆ తరువాత క్రికెట్ కొనసాగించలేదు. ఆయన స్వామి వివేకానందగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.
- Claimed By : క్లెయిమ్ చేసినది
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.