వాస్తవ తనిఖి: బ్యాంకాక్ ప్రదర్శన యొక్క చిత్రము శ్రీలంకలోని కోవిడ్ మరణాల పేరుతో వైరల్ అయ్యింది
ముగింపు: వైరల్ చిత్రములో చేయబడిన క్లెయిం అసత్యము అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. థాయిలాండ్ లో నిరసనల సమయములో ఉపయోగించబడిన నకిలి మృతదేహాల సంచీలు శ్రీలంకలో కోవిడ్ మరణాలుగా పేర్కొనబడ్డాయి
- By: Pallavi Mishra
- Published: Sep 15, 2021 at 06:32 PM
- Updated: Aug 22, 2024 at 01:09 PM
కొత్త ఢిల్లి (విశ్వాస్ న్యూస్): సామాజిక మాధ్యమములోఒక చిత్రము చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రములో ప్లాస్టిక్ లో చుట్టబడిన వస్తువుల మాదిరిగా మృతదేహాలు పోగు చేయబడి ఉండడం చూడవచ్చు. ఇవి శ్రీలంకలో కోవిడ్ తో మరణించిన వారి మృతదేహాలుగా ఈ వైరల్ పోస్ట్ తో క్లెయిం చేయబడింది. వైరల్ చిత్రములో చేయబడిన క్లెయిం అసత్యము అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. థాయిలాండ్ లో నిరసనల సమయములో ఉపయోగించబడిన నకిలి మృతదేహాల సంచీలు శ్రీలంకలో కోవిడ్ మరణాలుగా పేర్కొనబడ్డాయి.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
The Wes – වෙස්’ అనే ఫేస్బుక్ యూజర్ ఈ చిత్రాన్ని షేర్ చేశారు మరియు
సింహళి భాషలో క్యాప్షన్ వ్రాశారు. దీనిని హిందీలోకి అనువదించారు: ఇవి ప్యాక్
చేయబడిన చికెన్ అనుకుంటున్నారా. లేదు, వీరు కరోనాతో మరణించినవారు.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ ముందుగా గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయముతో ఈ వైరల్ చిత్రాన్ని సెర్చ్ చేసింది. ఈ చిత్రాన్ని మేము కొన్ని మీడియా రిపోర్ట్స్ లో చూశాము. ఈ చిత్రము జులై 19, 2021 నాడు worldofbuzz.com పై ప్రచురించబడిన ఒక రిపోర్ట్ లో కనుగొనబడింది. వార్తల ప్రకారం “థాయిలాండ్ వాసులు తమ దేశములో మహమ్మారిని అదుపుచేయుటలో విఫలం అయినందుకు తమ ప్రధాన మంత్రి ప్రయూత్ చాన్-ఓ-చా కు వ్యతిరేకంగా నిరసన తెలియజేయుటకు వీధుల వెంబడి తమ మోటార్ సైకిల్స్ మరియు కార్స్ లో నిరసన తెలియజేశారు”. వార్తల ప్రకారం, ఈ చిత్రం బ్యాంకాక్ నుండి తీసుకోబడింది.
అలాగే థాయ్ ఎంక్వైరర్ ద్వారా చేయబడిన ఒక ట్వీట్ లో ఒక సంఘటనకు సంబంధించిన వీడియో మాకు లభించింది. “ప్రణాళిక చేయబడిన ర్యాలీలలో నిరసనకారులు ప్రజాస్వామ్య స్మారక చిహ్నం వద్దకు చేరుకున్నారు. కోవిడ్ పట్ల ప్రభుత్వము యొక్క స్పందన సరిగ్గాలేదని తెలుపుతూ నిరసన ప్రదేశములో నమూనా శవాలు పోగు చేయబడ్డాయి. కోవిడ్ భయం ఉన్నప్పటికీ, ప్రజలు సమూహాలలో ఒకచోట చేరుతూనే ఉన్నారు…”
దీనికి సంబంధించి థాయ్ ఇంక్వైరర్ యొక్క విలేఖరి జేమ్స్ విల్సన్ ను మేము సంప్రదించాము. ఆయన ఇలా అన్నారు “ఈ చిత్రము జులై 18 నాడు బ్యాంకాక్ లో జరిగిన ఒక ప్రదర్శనకు సంబంధించినది. ఈ నమూనా శవాల సంచీల ద్వారా నిరసనకారులు కరోనా మరణాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశారు”
ఇప్పుడు ఫేస్బుక్ పై ఈ చిత్రాన్ని షేర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేసే సమయం వచ్చింది. ప్రొఫైల్ స్కాన్ చేసినప్పుడు ఈ పేజ్ కు 311,954 ఫాలోయర్స్ ఉన్నారని మాకు తెలిసింది.
निष्कर्ष: ముగింపు: వైరల్ చిత్రములో చేయబడిన క్లెయిం అసత్యము అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. థాయిలాండ్ లో నిరసనల సమయములో ఉపయోగించబడిన నకిలి మృతదేహాల సంచీలు శ్రీలంకలో కోవిడ్ మరణాలుగా పేర్కొనబడ్డాయి
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.