వాస్తవ తనిఖి: మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తిని కొట్టడం చూపే వీడియో ఒకటి కల్పన చేయబడి తెలంగాణకు చెందినది అని చెప్తూ వైరల్ చేయబడుతోంది.
ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో పోలీసులు ఒక వ్యక్తిని కొడుతున్నట్టు చూపుతున్న వీడియో క్లెయిమ్ అసత్యము అని తేలింది. మహారాష్ట్ర యొక్క జాల్నా జిల్లాలోని ఘటనపై కల్పన చేసి తెలంగాణాలోని నిజామాబాద్ ఘటనగా వైరల్ చేయబడింది.
- By: ameesh rai
- Published: Jun 19, 2021 at 02:23 PM
విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ) – కొంతమంది పోలీసులు ఒక వ్యక్తిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దెబ్బలు తింటున్న ఆ వ్యక్తి ఒక యాంబులెన్స్ డ్రైవర్ అని, అతను తెలంగాణకు చెందిన నిజామాబాద్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ ను ఆపేశాడని సోషన్ మీడియా యూజర్స్ వాదిస్తున్నారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ దావా అసత్యము అని తేలింది. మహారాష్ట్ర, జాల్నా ఘటనపై కల్పనలతో అది తెలంగాణాకు చెందిన నిజామాబద్ ఘటనకు చెందినది అని వైరల్ చేయబడుతోంది.
ఏది వైరల్ అవుతోంది
ఫేస్బుక్ యూజర్ AV Afroze Ahmed మే 29, 2021 నాడు వైరల్ వీడియోను పోస్ట్ చేస్తూ ఇంగ్లీషులో ఈ విధంగా వ్రాశారు, ‘పోలీసులు తెలంగాణాకు చెందిన నిజామాబాద్ లోని ఆసుపత్రిలో ఒక యాంబులెన్స్ డ్రైవర్ ఆక్సిజన్ సిలిండర్ ను ఆపివేస్తూ పట్టుకున్నారు. అయితే, రెండు-మూడు రోజులుగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, యాంబులెన్స్ కొరకు కూడా బిజినెస్ లభించలేదు.’
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్శన్ ను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు. ఫేస్బుక్ యూజర్ Shanmuga Srinivasan కూడా మే 29, 2021 నాటి వైరల్ వీడియో పోస్ట్ చేస్తూ ఈ విషయమే చెప్పారు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ ముందుగా వైరల్ వీడియోను InVID టూల్ లో వేసి దాని కీఫ్రేమ్స్ తీసుకుంది. మేము కీఫ్రేమ్స్ పై గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించాము. మేము news360global పేరున ఒక సైట్ కు చేరుకున్నాము, అక్కడ మే 28, 2021 నాడు ప్రచురించబడిన రిపోర్ట్ లో మాకు వైరల్ వీడియో పోలిన ఒక ఫోటో లభించింది. వీడియోలో కనిపించే వ్యక్తి ఒక బిజేపి నాయకుడు అని మరియు ఈ ఘటన మహారాష్ట్ర లోని జాల్నా జిల్లాలో జరిగింది అని ఈ రిపోర్ట్ లో పేర్కొనబడింది. రిపోర్ట్ ఆధారంగా, ఏప్రిల్ 9, 2021 నాడు జాల్నా ఆసుపత్రిలో ఒక కొట్లాట జరిగింది. ఈ రిపోర్ట్ గురించి ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
ఈ రిపోర్ట్ లో లభించిన క్లూ ఆధారంగా మేము వైరల్ అయిన క్లెయిం గురించి ఇంటర్నెట్ పై కూడా వెతికాము. మాకు మే 28, 2021 నాటి హిందుస్తాన్ టైమ్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడిన ఒక వీడియో లభించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ చేయబడిన అదే వీడియో. హిందుస్తాన్ టైమ్స్ యొక్క ఈ వీడియో రిపోర్ట్ లో ఈ ఘటన ఏప్రిల్ 9, 2021 నాడు మహారాష్ట్రకు చెందిన జాల్నా జిల్లాలోని దీపక్ ఆసుపత్రిలో జరిగింది అని తెలుపబడింది. రిపోర్ట్ ఆధారంగా, ఏ వ్యక్తిని అయితే పోలీసులు కొడుతున్నారో, అతను బిజేపి యూత్ సెక్రెటరీ శివరాజ్ నారియాల్వాలా అని తేలింది. ఆసుపత్రిలో తన పరిచయస్తుడు ఒకరు చేరారని, అతను మరణించారని, ఆయనను చూడటానికి చాలామంది వచ్చారని, అప్పుడు ఆసుపత్రివాళ్ళు పోలీసులను పిలిచారని, పోలీసులు తన వారిపై దుర్భాషలాడారని, దీని తరువాత పోలీసులు ఆయనను కొట్టడం ప్రారంభించారని, ఇది అప్పుడు తీసిన వీడియో అని శివరాజ్ పోలీసులపై ఆరోపించారు. ఈ వీడియో రిపోర్ట్ ఇక్కడ ఈ దిగువన చూడవచ్చు.
హిందుస్తాన్ టైమ్స్ యొక్క రిపోర్ట్ లో జాల్నా ఎస్పి ఈ విషయములో దర్యాప్తు కొరకు ఆదేశించారనే విషయం కూడా ప్రస్తావించబడింది. మే 28, 2021 నాడే ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ప్రచురించబడిన ఒక రిపోర్ట్ లో పోలీసులు ఒక బిజేపి కార్యకర్తను కొట్టారని ఆ వీడియో వెలుగులోకి వచ్చినప్పుడు 5 మంది పోలీసులను సస్పెండ్ చేశారని వ్రాయబడింది. ఈ రిపోర్ట్ ను ఇక్కడ చదవవచ్చు.
విశ్వాస్ న్యూస్ ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు నుండి ఈ వీడియోకు తెలంగాణలోని నిజామాబాద్ కు ఎలాంటి సంబంధం లేద స్పష్టం అయ్యింది. వీడియోలో కనిపించే వ్యక్తి కూడా యాంబులెన్స్ డ్రైవర్ కాదు, ఆయన జాల్నా, మహారాష్ట్ర యొక్క స్థానిక బిజేపి కార్యకర్త. విశ్వాస్ న్యూస్ ఇంటర్నెట్ పై దర్యాప్తు చేస్తుండగా తెలంగాణాలోని నిజామాబాద్ పోలీసుల ఒక ట్విట్టర్ హ్యాండిల్ పై ఒక ట్వీట్ లభించింది. ఈ ట్వీట్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తిని పోలీసులు కొట్టారు అనే వాదన అసత్యము అని తెలుపబడింది. ఈ ట్వీట్ ను ఈ దిగువన చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ వీడియో మరియు దీని వెంట చేయబడుతున్న వాదనను నిజామాబాద్ అడిషనల్ డీసీపి, లా అండ్ ఆర్డర్ కు షేర్ చేశారు. ఆయన కూడా అలాంటి ఒక సంఘటన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరగలేదు అని మరియు ఈ వాదన నకిలీది అని ధృవీకరించారు.
ఈ వైరల్ వాదనతో పోస్ట్ చేసిన ఫేస్బుక్ యూజర్ Shanmuga Srinivasan యొక్క ప్రొఫైల్ ను విశ్వాస్ న్యూస్ స్కాన్ చేసింది. యూజర్ చెన్నై నివాసి.
निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో పోలీసులు ఒక వ్యక్తిని కొడుతున్నట్టు చూపుతున్న వీడియో క్లెయిమ్ అసత్యము అని తేలింది. మహారాష్ట్ర యొక్క జాల్నా జిల్లాలోని ఘటనపై కల్పన చేసి తెలంగాణాలోని నిజామాబాద్ ఘటనగా వైరల్ చేయబడింది.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.